Telugu Global
Science and Technology

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్.. వీటిపై మంచి ఆఫర్లు!

దసరా సేల్ ఈ నెల 29 వరకూ కొనసాగుతుంది. పండుగ సీజన్‌లో కొత్త మొబైల్ కొనాలనుకునే వాళ్లు ఈ సేల్‌లో ఉన్న డీల్స్‌పై ఓ లుక్కేయొచ్చు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్.. వీటిపై మంచి ఆఫర్లు!
X

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్.. వీటిపై మంచి ఆఫర్లు!

ఈ మధ్యనే బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్.. ‘బిగ్ దసరా సేల్’ పేరుతో మరో సేల్ ప్రకటించింది. పోయిన సేల్‌లో డిస్కౌంట్ ఆఫర్ మిస్ అయ్యామనుకుంటే ఈ సేల్‌లో ట్రై చేయొచ్చు. దసరా సేల్ ఈ నెల 29 వరకూ కొనసాగుతుంది. పండుగ సీజన్‌లో కొత్త మొబైల్ కొనాలనుకునే వాళ్లు ఈ సేల్‌లో ఉన్న డీల్స్‌పై ఓ లుక్కేయొచ్చు.

బిగ్ దసరా సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్‌పై రకరకఅల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే బిగ్ దసరా సేల్’లో భాగంగా కొటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్‌‌బీఎల్, ఎస్‌బీఐ కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్ ఉంది.

ఈ సేల్‌లో ఐఫోన్స్, మోటొరోలా ఎడ్జ్ 40, ఒప్పో రెనో 10 , గూగుల్ పిక్సెల్ ఫోన్స్, శాంసంగ్ ఎస్ 22 , పోకో ఎఫ్5, వివో టీ2 ప్రో వంటి మొబైల్స్ పై ఆఫర్లు ఉన్నాయి. రూ.34,999 ధర ఉన్న మోటొరోలా ఎడ్జ్ 40 ఫోన్.. సేల్‌లో భాగంగా రూ.26,999లకు లభిస్తుంది. రియల్ మీ 11 ప్రో+ 5జీ ఫోన్ ధర రూ.32,999 నుంచి రూ.29,999లకు తగ్గింది. రూ.38,999 ధర ఉన్న ఒప్పో రెనో10 5జీ ఫోన్ రూ.32,999ల తగ్గింపు ధరకు లభిస్తుంది. అలాగే మోటో జీ54 ఫోన్ ధర రూ.17,999 నుంచి రూ.13,999కి తగ్గింది. పొకో ఎఫ్5 5జీ ఫోన్ ధర రూ.34,999 నుంచి రూ.23,999కు తగ్గింది.

వీటితోపాటు గూగుల్ పిక్సెల్ 7ఏ రూ.35,999( అసలు ధర రూ.43,999), శాంసంగ్ గెలాక్సీ ఎస్22 రూ.39,999(అసలు ధర రూ.85,999), నథింగ్ ఫోన్ 2 రూ.49,999 ( అసలు ధర రూ.59,999) ధరలకు లభిస్తున్నాయి.

దసరా సేల్‌లో ఐ-ఫోన్ 12 (64 జీబీ) రూ.42,999లకు లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ.39,999లకే లభిస్తుంది. దీని అసలు ధర రూ.49,900.

ఐ-ఫోన్ 13 (128 జీబీ) రూ.51,999కి లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ.49,399కే లభిస్తుంది. దీని అసలు ధర రూ.59,900.

ఐ-ఫోన్ 14 (128 జీబీ) రూ.61,999కి లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ.53,998లకే లభిస్తుంది. దీని అసలు ధర రూ.69,900.

First Published:  24 Oct 2023 1:00 PM IST
Next Story