యూట్యూబ్‌కు పోటీగా ‘ఎక్స్’ వీడియో ప్లాట్‌ఫామ్!
యూట్యూబ్ మాదిరిగానే ఎక్స్ ప్లాట్‌ఫామ్‌కు కూడా కోట్లలో యూజర్లు ఉన్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వీడియో ప్లాట్‌ఫామ్స్‌లో యూట్యూబ్ తిరుగులేని విధంగా రాణిస్తోంది. ఓపెన్ ప్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్‌కు కస్టమర్లు, కంటెంట్ క్రియేటర్లు కోకొల్లలుగా ఉన్నారు. అయితే ఇప్పుడు దీనికి పోటీ ఇచ్చేందుకు ఎలన్ మస్క్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. యూట్యుబ్‌కు పోటీగా మరో వీడియో ప్లాట్‌ఫామ్ తెరమీదకు రానుంది.
ఎక్స్(ట్విట్టర్) అధినేత ఎలన్ మస్క్.. త్వరలో ఎక్స్‌లో ఒక ఓపెన్ వీడియో ప్లాట్‌ఫామ్ రెడీ చేయనున్నట్టు ప్రకటించారు. ఇది యూట్యూబ్ మాదిరిగా లాంగ్- వీడియో స్ట్రీమింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు ఇందులోని కంటెంట్‌కు ఎలాంటి సెన్సార్ షిప్ అవసరం కూడా ఉండదని ఆయన ప్రకటించారు.
ఎక్స్ ప్లాట్ఫామ్లో భాగంగానే ఈ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ అందుబాటులోకి రానుంది. దీంతో ఎక్స్ యూజర్లు లాంగ్ వీడియోలను, వీడియో గేమ్స్, పాడ్కాస్ట్ల వంటివాటిని కూడా స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీల్లో చూసే వీలుంటుంది. ఎలన్ మస్క్ ఇప్పటికే ఎక్స్ టీవీ యాప్‌పై పనిచేస్తున్నారు. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ను టీవీల్లో యాక్సెస్ చేసే విధంగా ఈ యాప్ పనికొస్తుంది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత స్మార్ట్టీవీలోనే నేరుగా ఎక్స్ లాంగ్ వీడియోలను చూసే వీలుంటుంది.
యూట్యూబ్ మాదిరిగానే ఎక్స్ ప్లాట్‌ఫామ్‌కు కూడా కోట్లలో యూజర్లు ఉన్నారు. ఇప్పుడు వీళ్లలో వీడియో క్రియేటర్లు కూడా తయారైతే ఎక్స్.. యూట్యూబ్‌కు గట్టి పోటీనిస్తుందని యూజర్లు అభిప్రాయపడుతున్నారు. మరి క్రియేటర్లకు మానిటైజేషన్, కంటెంట్‌కు సెన్సా్ర్ షిప్ అనేవి ఎలా పనిచేస్తాయన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
ఇకపోతే ఎక్స్ ప్లాట్ఫామ్లో ఇటీవలే ‘ఆర్టికల్స్’ అనే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీంతో యూజర్లు పెద్దపెద్ద వ్యాసాలను ట్విట్ రూపంలో పోస్ట్ చేయొచ్చు. ఇదే రూపంలో ఇప్పుడు లాంగ్ వీడియోలను కూడా సెపరేట్ ట్యాబ్‌తో అందుబాటులోకి తెచ్చే విధంగా డెవలపర్లు పనిచేస్తున్నారు.