Telugu Global
Science and Technology

సోషల్ మీడియా అలవాటు తగ్గించుకునేందుకు ఎలన్ మస్క్ టిప్స్!

క్షణం తీరిక లేకుండా రోజంతా సోషల్ మీడియాలోనే ఉండేవాళ్లు చాలామందే ఉన్నారు. ఇలాంటి వాళ్లు మానసిక ఆరోగ్యం పాడవ్వక ముందే సోషల్ మీడియా నుంచి బయటకు రావాలి. సోషల్ మీడియా అడిక్షన్‌ను తగ్గించడం కోసం ఎలన్ మస్క్ కొన్ని సూచనలు చేశారు.

సోషల్ మీడియా అలవాటు తగ్గించుకునేందుకు ఎలన్ మస్క్ టిప్స్!
X

ఇప్పటి యూత్‌కు సోషల్ మీడియానే జీవితంగా మారిపోయింది. ముఖ్యంగా టీనేజర్లు దీనివల్ల ఎక్కువగా నష్టపోతున్నారు. రీల్స్ మోజులో పడి ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భలు ఇటీవల కొన్ని వెలుగులోకి వచ్చాయి. మితిమీరుతున్న సోషల్ మీడియా అడిక్షన్‌ను కంట్రోల్ చేయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

క్షణం తీరిక లేకుండా రోజంతా సోషల్ మీడియాలోనే ఉండేవాళ్లు చాలామందే ఉన్నారు. ఇలాంటి వాళ్లు మానసిక ఆరోగ్యం పాడవ్వక ముందే సోషల్ మీడియా నుంచి బయటకు రావాలి. సోషల్ మీడియా అడిక్షన్‌ను తగ్గించడం కోసం ఎలన్ మస్క్ కొన్ని సూచనలు చేశారు. అవేంటంటే..

సోషల్ మీడియా వలలో ఒక్కసారి చిక్కుకుంటే ఇక బయటపడటం కష్టం. కాబట్టి పిల్లలకు చిన్న వయసు నుంచే సోషల్ మీడియా వాడే అలవాటుని తగ్గించాలి. ఈ విషయంపై పేరెంట్స్ ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

యూజర్లను ఎక్కువగా అట్రాక్ట్ చేసేలా సోషల్ మీడియా అల్గారిథమ్స్ ఉంటాయి. కాబట్టి పిల్లలు వాటిని వాడే విషయంలో తల్లిదండ్రులే జాగ్రత్తపడాలని మస్క్ సూచించారు.

పిల్లలు సోషల్ మీడియాకు అడిక్ట్ అయితే వారి మానసిక ఆరోగ్యంతో పాటు చదువు కూడా పాడవుతుంది. కాబట్టి పిల్లలను ఓ కంట గమనిస్తూ ఉండాలి. గేమ్స్ కోసమనో లేదా ఫోన్ ఇస్తే సైలెంట్‌గా ఉంటారనో మొబైల్ ఇవ్వడం అలవాటు చేయకూడదు.

పిల్లల మొబైల్ ఎక్కువగా వాడకుండా ఒక లిమిట్ పెట్టాలి. రోజంతా మొబైల్ పట్టుకుని ఉండే పిల్లల విషయంలో మరింత జాగ్రత్తపడాలి. మొబైల్స్‌లో సోషల్ మీడియా యాప్స్ లేకుండా చూడాలి.

చిన్నతనం నుంచే సోషల్ మీడియాకు అలవాటు పడితే వారిలో ఆలోచనాశక్తి తగ్గిపోయే ప్రమాదముంది. కాబట్టి మొబైల్‌కు బదులుగా ఫిజికల్ యాక్టివిటీస్‌పై ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగేలా పేరెంట్సే జాగ్రత్తలు తీసుకోవాలి.

First Published:  30 July 2024 2:30 AM GMT
Next Story