Telugu Global
Science and Technology

యూట్యూబ్‌లో ఈ సింపుల్ ట్రిక్స్ తెలుసా?

ఈ రోజుల్లో యూట్యూబ్ అంటే తెలియని వారుండరు. రోజులో ఎంత కొంత సమయం యూట్యూబ్ వీడియోల కోసం కేటాయించేవాళ్లు ఎంతోమంది ఉంటారు. అయితే యూట్యూబ్‌లో మనకు తెలియని ఎన్నో హిడెన్ ఫీచర్లున్నాయి. వాటిలో కొన్ని యూజ్‌ఫుల్ ట్రిక్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

యూట్యూబ్‌లో ఈ సింపుల్ ట్రిక్స్ తెలుసా?
X

ఈ రోజుల్లో యూట్యూబ్ అంటే తెలియని వారుండరు. రోజులో ఎంత కొంత సమయం యూట్యూబ్ వీడియోల కోసం కేటాయించేవాళ్లు ఎంతోమంది ఉంటారు. అయితే యూట్యూబ్‌లో మనకు తెలియని ఎన్నో హిడెన్ ఫీచర్లున్నాయి. వాటిలో కొన్ని యూజ్‌ఫుల్ ట్రిక్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

రోజుకి 200 కోట్లమంది యూట్యూబ్‌ను వీక్షిస్తుంటారని అంచనా. ఇందులో అన్ని అంశాలకు సంబంధించిన కంటెంట్ ఉంటుంది. అయితే యూట్యూబ్ వీడియోలు చూసేటప్పుడు ఈ సింపుల్ ట్రిక్స్ ఉపయోగించడం ద్వారా యూట్యూబ్ ఎక్స్‌పీరియెన్స్‌ను మరింత బెటర్‌‌గా మార్చుకోవచ్చు. అదెలాగంటే..

యూట్యూబ్‌లో వీడియో చూసేటప్పుడు డబుల్ ట్యాప్ చేసి ఫార్వాడ్, బ్యాక్‌వార్డ్ చేయొచ్చని మనకు తెలుసు. రెండు సార్లు నొక్కితే 10 సెకన్లు, నాలుగు సార్లు నొక్కితే30 సెకన్ల పాటు వీడియో ఫార్వాడ్ అవుతుంది. అయితే ఈ డీఫాల్ట్ సీకింగ్ టైంను మార్చుకోవచ్చు కూడా. యూట్యూబ్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘జనరల్’లో ‘డబుల్ ట్యాప్ టు సీక్’ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ 5, 10, 15, 20, 30, లేదా 60 సెక‌న్ల వ‌ర‌కు సీకింగ్ టైం మార్చుకోవచ్చు.

రీసెంట్‌గా యూట్యూబ్ జత చేసిన మరో ఫీచర్ ఏంటంటే.. డబుల్ ట్యాప్ చేసి అలాగే హోల్డ్ చేసి ఉంచితే వీడియో 2x స్పీడ్‌లో ప్లే అవుతుంది. అలాగే వీడియో పాజ్‌లో ఉన్నప్పుడు లాంగ్ ప్రెస్ చేసి వీడియోలో ముందుకి లేదా వెనక్కి వెళ్లొచ్చు.

యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు వీడియో స్క్రీన్‌ను కిందకు స్వైప్ చేస్తే మినిమైజ్ అవుతుంది. పైకి స్వైప్ చేస్తే ఫుల్ స్క్రీన్ మోడ్ ఆన్ అవుతుంది. వీడియో పుల్​ స్క్రీన్​ మోడ్​లో ఉన్నప్పుడు బ్యాక్‌కు వచ్చే పనిలేకుండా ఫింగ‌ర్‌‌తో పైకి స్వైప్ చేస్తే రిలేటెడ్ వీడియోలు కనిపిస్తాయి.

ఇక యూట్యూబ్‌లో ఉన్న మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ‘వాచ్ టైం రిమైండర్’. తెలియ‌కుండా యూట్యూబ్​లో గంటల కొద్దీ గ‌డపకుండే ఉండేందుకు సెట్టింగ్స్‌లో ‘జనరల్’లోకి వెళ్లి ‘రిమైండ్ మీ టు టేక్ ఎ బ్రేక్’ అన్న ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ ఎంత సేపటికి బ్రేక్ కావాలో టైం సెట్ చేసుకుంటే యూట్యూబ్ మీకు నోటిఫికేషన్ ఇస్తుంది.

యూట్యూబ్‌లో చూసే వీడియోలు సెర్చ్ యాక్టివిటీ లేదా హిస్టరీలోకి వెళ్లకుండా ఉండాలంటే అలాగే ఆయా వీడియోలకు సంబంధించిన రిలేటెడ్ సజెషన్లు రాకుండా ఉండాలంటే యూట్యూబ్‌లో ఇన్‌కాగ్నిటో మోడ్ ఆన్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌లో పైన ‘అకౌంట్’ బ‌ట‌న్​ మీద నొక్కితే అక్కడ ‘టర్న్ ఆన్ ఇన్‌కాగ్నిటో’ అని ఉంటుంది. ఈ మోడ్‌లో ఉన్నప్పుడు హిస్టరీ సేవ్ అవ్వదు.

First Published:  16 Jan 2024 12:30 PM IST
Next Story