Telugu Global
Science and Technology

నెట్‌ఫ్లిక్స్ యాప్‌లో ఈ ఫీచర్లు తెలుసా?

స్ట్రీమింగ్ కోసం డిజైన్ చేసిన ఈ యాప్‌లో బోలెడన్ని యాక్సెసబిలిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నెట్‌ఫ్లిక్స్ యాప్‌లో ఈ ఫీచర్లు తెలుసా?
X

నెట్‌ఫ్లిక్స్ యాప్‌లో ఈ ఫీచర్లు తెలుసా?

ఓటీటీ స్ట్రీమింగ్ చేసేవాళ్లకు నెట్‌ఫ్లిక్స్ యాప్ గురించి తెలియకుండా ఉండదు. అయితే స్ట్రీమింగ్ కోసం డిజైన్ చేసిన ఈ యాప్‌లో బోలెడన్ని యాక్సెసబిలిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నెట్‌ఫ్లిక్స్‌లో ఉండే సెర్చ్ బార్‌.. రకరకాల సెర్చింగ్ టూల్స్‌ను సపోర్ట్ చేస్తుంది ఉదాహరణకు సెర్చ్ బాక్స్‌లో కొటేషన్స్ పెట్టి.. ‘నెట్‌ఫ్లిక్స్’ అని టైప్ చేస్తే ‘నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్’ టైటిల్స్‌ను మాత్రమే చూపిస్తుంది. అలాగే ‘బ్రౌజ్‌ బై లాంగ్వేజ్‌’ ఆప్షన్ ద్వారా భాషల ఆధారంగా కంటెంట్ సెర్చ్ చేయొచ్చు.

నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌ను ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేస్తుంటారు చాలామంది. అయితే మీరు చూసే కంటెంట్‌ను ఇతరులకు తెలియకుండా దాచాలనుకుంటే.. హిస్టరీలో థంబ్‌ నెయిల్స్‌పై ఉన్న ‘x’ బటన్‌ను క్లిక్‌ చేసి లిస్ట్‌లో కనిపించకుండా చేయొచ్చు.

నెట్‌ఫ్లిక్స్‌లో హెచ్‌డీ స్ట్రీమింగ్ వల్ల డేటా లిమిట్‌ త్వరగా అయిపోతుంటుంది. అలా కాకుండా డేటాను సేవ్ చేయాలనుకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్ట్రీమింగ్‌ క్వాలిటీ తగ్గించి డేటా యూసేజ్‌ను తగ్గించొచ్చు.

ఇకపోతే డెస్క్‌టాప్‌పై నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమ్ చేసేవాళ్లు కీబోర్డ్ షార్ట్‌కట్స్‌ను ఉపయోగించి కూడా ఈజీగా బ్రౌజ్‌ చేయొచ్చు. కీబోర్డులో ‘F’ బటన్ క్లిక్‌ చేస్తే ఫుల్‌ స్క్రీన్‌ వస్తుంది. ‘Esc’ క్లిక్‌ చేస్తే ఫుల్‌ స్క్రీన్‌ నుంచి బయటకు రావొచ్చు. అలాగే ‘స్పేస్‌బార్‌’పై క్లిక్‌ చేస్తే వీడియో పాజ్‌ అవుతుంది. ఫార్వర్డ్ చేయడానికి ‘షిఫ్ట్’ పట్టుకుని రైట్‌ యారో నొక్కాలి. రివైండ్ చేయడానికి ‘షిఫ్ట్’ పట్టుకుని లెఫ్ట్‌ యారోపై క్లిక్‌ చేయాలి. ‘M’ బటన్‌ క్లిక్‌ చేస్తే ఆడియో మ్యూట్‌ అవుతుంది. ‘S’ బటన్ నొక్కడం ద్వారా వీడియో ఇంట్రోని స్కిప్ చేయొచ్చు.

First Published:  18 July 2023 2:48 PM IST
Next Story