హెడ్ ఫోన్స్ ఎలా వాడాలో తెలుసా?
ఉదయం లేచింది మొదలు చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తిరిగే వాళ్లు చాలామందే ఉంటారు. ఇలా అతిగా హెడ్ ఫోన్స్ వాడడం వల్ల చెవిలోని కర్ణభేరి పాడవుతుంది.
ఉదయం లేచింది మొదలు చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తిరిగే వాళ్లు చాలామందే ఉంటారు. ఇలా అతిగా హెడ్ ఫోన్స్ వాడడం వల్ల చెవిలోని కర్ణభేరి పాడవుతుంది. అంతేకాదు ఈ అలవాటు వినికిడి లోపానికి కూడా దారి తీస్తుంది.
చెవులు పొడిగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాయి. కానీ అదేపనిగా ఇయర్ ఫోన్స్ వాడడం వల్ల చెవులు తడిగా మారడాన్ని మనం గమనించొచ్చు. తరచూ హెడ్ ఫోన్స్ పెట్టుకునే వాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా వటివల్ల కలిగే నష్టాన్ని కొంత వరకూ తగ్గించుకోవచ్చు. అదెలాగంటే..
హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం ద్వారా చెవులకు సరిగా గాలి ఆడదు దాంతో చెవిలోని బ్యాక్టీరియా అమాంతం పెరుగుతుంది. ఇది రకరకాల వినికిడి సమస్యలకు కారణం అవ్వొచ్చు. కాబట్టి రబ్బర్ బడ్స్ ఉండే హెడ్ ఫోన్స్‌కు బదులు వెడల్పాటి పరిమాణం ఉన్న హెడ్ ఫోన్స్‌ను ఎంచుకోవాలి. చెవి రంధ్రాలను పూర్తిగా కవర్ చేయకుండా ఉండే ఇయర్ ఫోన్స్ వాడాలి.
తరచూ పాటలు వినేవాళ్లు, ఆన్‌లైన్ కాల్స్ ఎక్కువగా మాట్లాడేవాళ్లు చెవిలోకి దూరిపోయే ఇయర్ బడ్స్‌కు బదులు చెవిని పూర్తిగా కవర్ చేసే ఓవర్ ది ఇయర్ హెడ్ ఫోన్స్ వాడొచ్చు. ఇవి కొంతవరకూ చెవుల్లోకి గాలి వెళ్లేలా చేస్తాయి.
ఇయర్ ఫోన్స్‌ను తరచూ శానిటైజర్‌తో లేదా వేడినీటిలో ముంచిన బట్టతో శుభ్రం చేస్తుండడం ముఖ్యం. అలాగే అదేపనిగా హెడ్ ఫోన్స్ వాడేవాళ్లు చెవి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. వేడినీరు లేదా నూనెతో చెవిని శుభ్రం చేసుకోవడం లేదా డాక్టర్ సలహా మేరకు ఇయర్ డ్రాప్స్ వంటివి వాడడం చేయొచ్చు.
ఇయర్ ఫోన్స్ వాడుతున్నప్పుడు పూర్తి వాల్యూమ్ పెట్టుకోవడం వల్ల మరింత ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి తక్కువ వాల్యూమ్‌తోనే హెడ్ ఫోన్స్‌ను వాడాలి. హెడ్ ఫోన్స్ వాడనప్పుడు కూడా అలాగే వాటిని ధరించకుండా వాటిని తీసి పక్కన పెట్టడం మంచిది.
అతిగా హెడ్ ఫోన్స్ వాడడం వల్ల పూర్తిగా వినికిడిని కోల్పొయిన వాళ్లు చాలామందే ఉన్నారు. కాబట్టి చెవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతైనా అవసరం. దీనికోసం ఆరు నెలలకోసారి ఇయర్ టెస్ట్ చేయించుకోవచ్చు. అలాగే చెవులను రోజూ శుభ్రం చేసుకోవడం కూడా ముఖ్యమే.