Telugu Global
Science and Technology

జీపీటీ4 విజన్ గురించి తెలుసా?

జీపీటీ-4 విజన్‌ అనేది విజువల్స్ ఆధారంగా డేటాను స్టడీ చేసే ఏఐ టూల్. అంటే దీనికి టెక్స్ట్ రూపంలో కాకుండా ఇమేజ్‌ల రూపంలో డేటాను ఇవ్వాలి.

జీపీటీ4 విజన్ గురించి తెలుసా?
X

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకీ అప్‌డేట్ అవుతోంది. ఎలాంటి డేటాను అయినా క్షణాల్లో రెడీ చేసే చాట్ జీపీటీ.. ఇప్పుడు డేటా నుంచి విజువల్స్‌కు అప్‌డేట్ అవుతోంది. జీపీటీ 4 విజన్ పేరుతో అందుబాటులో ఉన్న సరికొత్త ఏఐ టూల్.. ఎలాంటి ఇమేజ్‌ను అయినా చూసి పూర్తిగా అర్థం చేసుకుంటుంది. ఇదెలా పనిచేస్తుందంటే..

జీపీటీ-4 విజన్‌ అనేది విజువల్స్ ఆధారంగా డేటాను స్టడీ చేసే ఏఐ టూల్. అంటే దీనికి టెక్స్ట్ రూపంలో కాకుండా ఇమేజ్‌ల రూపంలో డేటాను ఇవ్వాలి. ఉదాహరణకు ఛార్ట్‌లు, ఫొటోలు, ప్రాచీన గ్రంథాలు.. ఇలా ఏ రకమైన విజువల్ ఇన్‌పుట్ ఇచ్చినా అందులో ఉన్న పూర్తి సారాంశాన్ని స్టడీ చేయగలదు. ఇమేజ్ రూపంలో ఉన్న ఏ విషయం గురించైనా దీన్ని అడగొచ్చు. ఈ టెక్నాలజీని రకరకాల రంగాల్లో వాడుకోవచ్చు. ఇది మనుషుల పనిని మరింత ఈజీ చేస్తుంది.

చాట్‌జీపీటీ.. ‘లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్’ అనే టెక్నాలజీపై పనిచేస్తే జీపీటీ 4 విజన్.. ‘లార్జ్‌ మల్టీమోడల్‌ మోడల్‌’ అనే టెక్నాలజీపై పనిచేస్తుంది. అంటే ఇది కేవలం భాష, సమాచారాన్నే కాకుండా దృశ్యాలను కూడా అర్థం చేసుకోగలదు. ఇమేజ్‌ ద్వారా సమాచారాన్ని తీసుకుని దాన్ని విశ్లేషించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది.

ఈ టూల్.. రీసెర్చర్లకు, వెబ్‌ డెవలపర్లకు, డేటా ఎనలిస్టులకు, సెక్యూరిటీ సంస్థలకు, కంటెంట్‌ క్రియేటర్లకు రకరకాలుగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు రీసెర్చర్లు ప్రాచీన గ్రంధాలు, శాసనాలు, ఆర్కియాలజికల్ ఫొటోలు, పాత కాలపు వస్తువులు.. ఇలాంటి ఇన్‌పుట్‌లు ఇచ్చి వాటి తాలూకూ చరిత్రను స్టడీ చేయొచ్చు. అలాగే డెవలపర్లు.. నాలుగైదు ఏళ్లకు సంబంధించిన డేటా ఛార్ట్‌లు, గ్రాఫ్‌లు ఇచ్చి.. క్షణాల్లో ఆ డేటా సమ్మరీ, అనాలసిస్‌లను పొందొచ్చు. చేతితో గీసిన డిజైన్‌ను ఇన్‌పుట్‌గా ఇచ్చి కోడ్‌ పొందొచ్చు. సెక్యూరిటీ సంస్థలు, నిఘా సంస్థలు కూడా ఎవిడెన్స్‌లను స్టడీ చేయడానికి ఈ టూల్‌ను వాడుకోవచ్చు. అయితే ఈ టూల్‌కు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. సున్నితమైన డేటా విశ్లేషణల కోసం దీనిపై పూర్తిగా ఆధారపడొద్దని ఓపెన్ ఏఐ సంస్థ చెప్తోంది.

First Published:  2 May 2024 2:00 PM IST
Next Story