Telugu Global
Science and Technology

గూగుల్ పీపుల్ కార్డు గురించి తెలుసా?

డిజిటల్ వరల్డ్‌లో మీకంటూ ఒక ఐడెంటిటీ కావాలా? అయితే గూగుల్ పీపుల్ కార్డుని క్రియేట్ చేసుకోండి.

Google People Card: గూగుల్ పీపుల్ కార్డు గురించి తెలుసా?
X

Google People Card: గూగుల్ పీపుల్ కార్డు గురించి తెలుసా?

డిజిటల్ వరల్డ్‌లో మీకంటూ ఒక ఐడెంటిటీ కావాలా? అయితే గూగుల్ పీపుల్ కార్డుని క్రియేట్ చేసుకోండి. యూజర్ల ఆన్‌లైన్ ఐడెంటిటీని ఇంప్రూవ్ చేసేందుకు గూగుల్.. కొత్తగా పీపుల్ కార్డ్‌ను తీసుకొచ్చింది. ఇదెలా ఉపయోగపడుతుందంటే..

సెలబ్రిటీల గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తే బోలెడు సెర్చ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అదే ఒక మామూలు వ్యక్తి గురించి సెర్చ్ చేస్తే.. ఎలాంటి రిజల్ట్స్ చూపించకపోవచ్చు. అయితే చిన్న చిన్న బిజినెస్‌లు చేసేవాళ్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఆన్‌లైన్ ఐడెంటిటీ అవసరం ఉంటుంది.

తమ గురించి గూగుల్‌లో సెర్చ్‌ చేసినప్పుడు సరైన వివరాలు రావడం ద్వారా వాళ్ల కొత్త బిజినెస్‌లకు కు కొంత మేలు జరిగే అవకాశం ఉంది. అందుకే ఇలాంటివాళ్లకోసం గూగుల్ పీపుల్ కార్డుని తీసుకొచ్చింది.

ఇదొక డిజిటల్‌ బిజినెస్‌ కార్డులాంటిది. సెర్చ్‌ రిజల్ట్స్‌లో సరైన సమాచారాన్ని చూపించడానికిది ఇది హెల్ప్ అవుతుంది. ఈ పీపుల్‌ కార్డు ఫీచర్‌ మనదేశంతో పాటు కెన్యా, నైజీరియా, దక్షిణాఫ్రికా దేశాల్లో అందుబాటులో ఉంది. దీన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలంటే..

ఫోన్‌లో గూగుల్‌ యాప్‌ ఓపెన్‌ చేసి ‘యాడ్‌ మీ టు సెర్చ్‌’ అని టైప్‌ చేయాలి.

‘యాడ్‌ యువర్‌సెల్ఫ్‌ టు గూగుల్‌ సెర్చ్‌’ రిజల్ట్‌లో ‘గెట్‌ స్టార్టెడ్‌’ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయాలి.

మీ వివరాలు, ఇ–మెయిల్‌ అడ్రెస్, సోషల్ మీడియా అకౌంట్స్ లాంటివి ఎంటర్ చేసి అప్లికేషన్ ఫిల్ చేయాలి.

డీటెయిల్స్ ఎంటర్ చేశాక ఒకసారి ప్రివ్యూను చెక్‌ చేసుకోవాలి. తర్వాత కార్డును సేవ్‌ చేసుకోవాలి.

అంతే .. వెంటనే మీ గూగుల్‌ పీపుల్‌కార్డు ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది. మీ పేరుతో ఎవరైనా గూగుల్‌ సెర్చ్ చేస్తే మీ వివరాలన్నీ కనిపిస్తాయి.

First Published:  27 Feb 2023 6:37 PM IST
Next Story