Telugu Global
Science and Technology

మహా కుంభమేళాలో ధోనీ,కోహ్లీ, రోహిత్‌

టీమిండియా మద్దతుదారుల బృందం 'ది భారత్‌ ఆర్మీ' ఏఐ సాయంతో సృష్టించిన ఫొటోలివి

మహా కుంభమేళాలో ధోనీ,కోహ్లీ, రోహిత్‌
X

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాను టీమిండియా క్రికెటర్లు సందర్శించారా? ఈ ఫొటోలు చూస్తే ఎవరికైనా ఆలా అనిపించకమానదు. క్రికెటర్లు మహాకుంభమేళాను సందర్శించినట్లు ఏఐ ద్వారా క్రియేట్‌ చేస్తున్న ఫొటోలను చాలామంది వాట్సప్‌ స్టేటస్‌లలో పెట్టుకుంటున్నారు. అవి నిజమేనని భ్రమపడుతున్నారు. అయితే ఇదంతా ఏఐ మాయ. జనరేటివ్‌ ఏఐ (కృత్రిమ మేధ) సాయంతో సృష్టిస్తున్న ఫొటోలు, వీడియోలు ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే తాజాగా క్రికెటర్లు కుంభమేళాను దర్శించుకున్నట్లుగా ఉన్న ఫొటోలు నెటింట్లో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.

టీమిండియా మద్దతుదారుల బృందం 'ది భారత్‌ ఆర్మీ' ఈ ఫొటోలను ఏఐ సాయంతో సృష్టించింది. క్రికెటర్లు మహా కుంభమేళాకు కుంభమేళాకు వెళితే అనే క్యాప్షన్‌తో వీటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నది. ప్రముఖ క్రికెటర్లు ఎంఎస్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, బుమ్రా, హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ తదితరులు కాషాయ డ్రెస్సుల్లో కుంభమేళాన దర్శించుకున్నట్లుగా ఈ ఫొటోలను రూపొందించారు. ఈ ఫొటోలు చూస్తే నిజంగానే వాళ్లు అక్కడికి వెళ్లినట్లు అనిపిస్తుంది.

First Published:  25 Jan 2025 10:00 AM IST
Next Story