ఈ సెట్టింగ్‌తో ఇన్‌స్టా వాడకాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు!
రోజంతా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ గడుపుతుంటారు చాలామంది.
రోజంతా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ గడుపుతుంటారు చాలామంది. రీల్స్ స్క్రోల్ చేయడం మొదలుపెడితే టైం తెలియనంతగా అందులో లీనమైపోతుంటారు. ఇలాంటి అడిక్షన్ నుంచి బయటపడేందుకు ఇన్‌స్టాగ్రామ్ ఓ ఇన్‌బిల్ట్ టూల్‌ను అందుబాటులో ఉంచింది. ఈ టూల్ సాయంతో ఇన్‌స్టాగ్రామ్ వాడకాన్ని ఎవరికి వారు కంట్రోల్ చేసుకోవచ్చు.
రోజంతా రీల్స్ చూస్తూ.. తెలియకుండానే టైం వేస్ట్ చేస్తుంటారు చాలామంది. తీరా ఆ విషయం అర్థం అయ్యాక ఇకపై ఇన్‌స్టా వాడకూడదని యాప్ అన్‌ఇన్ స్టాల్ చేయడం, అకౌంట్ డిలీట్ చేయడం వంటివి చేస్తుంటారు. మళ్లీ ఉండలేక కొంత కాలానికి తిరిగి యాప్ ఇన్‌స్టాల్ చేస్తుంటారు. ఈ తంతుకి ఫుల్‌స్టాప్ పెట్టాలంటే ఇన్‌స్టాను లిమిట్‌గా వాడడం అలవాటు చేసుకోవాలి. దీనికోసం ఇన్‌స్టాలో ఉండే టైం లిమిట్ టూల్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఇన్‌స్టాగ్రామ్ యూసేజ్‌ను తగ్గించుకునేందుక యాప్‌లోకి వెళ్లి, టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న మెనూ ఐకాన్‌పై నొక్కాలి. అక్కడ ‘సెట్టింగ్స్’పై క్లిక్ చేసి, ‘ప్రైవసీ’ ఆప్షన్ లోకి వెళ్లాలి. అక్కడ ‘టైమ్ స్పెంట్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. ఇన్‌స్టాగ్రామ్‌లో రోజుకి ఎంత టైం గడుపుతున్నారో చూపిస్తుంది. రోజుకి రెండు గంటల కంటే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్లు అక్కడ ‘డైలీ లిమిట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
డైలీ లిమిట్ ఆప్షన్‌లో రోజుకి ఎంతసేపు ఇన్‌స్టాగ్రామ్ వాడాలనుకుంటున్నారో టైం లిమిట్ సెట్ చేసుకుంటే అంతకంటే ఎక్కువ టైం గడుపుతున్నప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అలా ఎక్కువ టైం గడపకుండా జాగ్రత్తపడొచ్చు. అయితే ఈ ఫీచర్ ఆన్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చాక ఇగ్నోర్ చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదు.
ఇకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండే ‘క్వైట్ మోడ్’ ఫీచర్ ద్వారా ఇన్‌స్టా నోటిఫికేషన్లు రాకుండా చూసుకోవచ్చు. రోజులో కొన్ని ముఖ్యమైన టైమింగ్స్‌లో నోటిఫికేషన్స్ రాకుండా కూడా స్టార్ట్, ఎండ్ టైమ్స్ సెట్ చేసుకోవచ్చు.
ఇక వీటితోపాటు మొబైల్ సెట్టింగ్స్‌లో డేటా యూసేజ్ లిమిట్ లేదా డిజిటల్ వెల్ బీయింగ్ యాప్స్ సాయంతో కూడా సోషల్ మీడియా వాడకాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే ఎన్ని సెట్టింగ్స్ వాడుకున్నా సొంతగా కొంత నిగ్రహం ఉండడం అవసరం. గంటల తరబడి సోషల్ మీడియాలో గడిపే సమయంలో కొంత సమయాన్నైనా ప్రొడక్టివ్‌గా మరేదైనా పనికోసం వాడుకుంటే మీరనుకున్న పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.