Telugu Global
Science and Technology

రోవర్ కి రూట్ చెబుతున్న ఇస్రో

జాబిల్లి ఉపరితలంపై చంద్రయాన్-3 ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. అయితే, చంద్రుడి దక్షిణ ధ్రువానికి సంబంధించి సమాచారాన్ని సేకరిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ కు ఓ ప్రమాదం ఎదురయ్యింది. అయితే ఇస్రో అప్రమత్తం చేయడంతో రోవర్ సేఫ్ గా బయటపడింది.

రోవర్ కి రూట్ చెబుతున్న ఇస్రో
X

రోవర్ కి రూట్ చెబుతున్న ఇస్రో

జాబిల్లి ఉపరితలంపై చంద్రయాన్-3 ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. అయితే, చంద్రుడి దక్షిణ ధ్రువానికి సంబంధించి సమాచారాన్ని సేకరిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ కు ఓ ప్రమాదం ఎదురయ్యింది. అయితే ఇస్రో అప్రమత్తం చేయడంతో రోవర్ సేఫ్ గా బయటపడింది.

జాబిల్లిపై 4 మీటర్ల లోతైన గోతిలో పడే ముప్పును రోవర్ తప్పించుకుంది. ఇస్రో సూచనలు అనుసరించి దారి మార్చుకుని సురక్షిత మార్గంలో ప్రయాణం ముందుకు వెళుతోంది.

రోవర్ వేసే అడుగులను ఇస్రో చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ప్రజ్ఞాన్ వెళ్లే మార్గంలో గొయ్యి మరో 3 మీటర్ల దూరంలో ఉందనగా, ఇస్రో గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుంచి రోవర్ కు రూట్ మార్చుకోమని సంకేతాలు పంపింది. నిన్న జరిగిన ఈ ఘటన వివరాలు ఇస్రో ఈరోజు తన అధికారిక ఎక్స్ అకౌంట్లో షేర్ చేసింది. రోవర్ గమనానికి సంబంధించిన రెండు ఫొటోలను విడుదల చేసింది. అందులో గొయ్యి ఉన్న ప్రాంతాన్ని , రోవర్ కొత్త దారిని చూడొచ్చు. ‘ రోవర్ 2023, ఆగస్టు 27న ముందుకు వెళ్తున్న సమయంలో మూడు మీటర్ల దూరంలో క్రాటర్ కనపడింది. అది నాలుగు మీటర్ల వెడల్పు ఉంది. దీంతో రోవర్ దిశ మార్చుకునేలా చేశాము. ఆ తర్వాత రోవర్ మరో దిశగా సురక్షితంగా వెళుతోంది ’ అని ఇస్రో పేర్కొంది.

చంద్రునిపై దిగిన తర్వాత ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై స్థిరంగా ఉంటుంది. రోవర్ ఆ సమీపంలో తిరిగి అక్కడి సమాచారాన్ని అంతటినీ ల్యాండర్ కు పంపుతుంది. ల్యాండర్ నుంచి సమాచారం ఇస్రోకు అందుతుంది.


ఆరు చక్రాలు ఉన్న ఈ రోవర్ చంద్రుడి ఉపరితలంపై ఒక లూనార్ డే(14 Earth days) పాటు తిరుగుతుంది. చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించిన మొదటి శాస్త్రీయ పరిశోధన వివరాలను ఇస్రో ఆదివారం పంచుకున్న విషయం తెలిసిందే. విక్రమ్ ల్యాండర్‌లోని 'చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్' చాస్టే పరికరం. చంద్రుడి ఉపరితంపైన కాస్త లోతులో సేకరించిన ఉష్ణోగ్రతల గణాంకాలను గ్రాఫ్ రూపంలో వెల్లడించింది.

.

First Published:  28 Aug 2023 11:12 PM IST
Next Story