పండుగ సేల్‌లో ఐఫోన్ కొంటున్నారా? ఇది తెలుసుకోండి!
ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్స్ జరుగుతున్నాయి. ఈ సేల్స్‌లో ముఖ్యంగా ఐఫోన్స్‌పై స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి.
ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్స్ జరుగుతున్నాయి. ఈ సేల్స్‌లో ముఖ్యంగా ఐఫోన్స్‌పై స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్లలో ఏయే ఐఫోన్లపై ఎలాంటి డీల్స్ ఉన్నాయి? ఏ ఐఫోన్ కొనడం బెస్ట్? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
స్పెషల్ సేల్స్‌లో భాగంగా ఇ–కామర్స్ సంస్థలు స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. ముఖ్యంగా ప్రీమియం మొబైల్స్ అయిన ఐఫోన్లపై పలు ఆకర్షనీయమైన ఆఫర్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో ఐఫోన్ 13, ఐఫోన్ 14 లపై బెస్ట్ డీల్స్ ఉన్నాయి.
ఐఫోన్ 13, 128జీబీ వేరియంట్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 48,999కు లభిస్తుంది. దీని అసలు ధర రూ.59,900 కాగా 30 శాతం డిస్కౌంట్‌తో లభిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ విషయానికొస్తే.. ఐఫోన్ 14, 128జీబీ వేరియంట్ రూ.56,999కి లభిస్తోంది. దీని అసలు ధర రూ.69,900. అలాగే ఐఫోన్ 15, 128జీబీ వేరియంట్ ధర రూ.69,900గా ఉంది. దీనిపై రూ.6,000 వరకూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆఫర్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్స్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ద్వారా అదనంగా రూ.41,150దాకా తగ్గింపు పొందొచ్చు.
అదేవిధంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12, 64జీబీ వేరియంట్ ధర రూ.40,999గా ఉంది. దీని అసలు ధర రూ.79,900. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ద్వారా అదనంగా రూ.24,600 తగ్గింపు పొందొచ్చు.
ఏ ఐఫోన్ బెస్ట్ అంటే..
సేల్‌లో ఐఫోన్ 14 తీసుకోవాలనుకునేవాళ్లు దానికి బదులు ఐఫోన్ 13 ఎంచుకోవడం బెటర్ అని నిపుణుల సలహా. స్పెసిఫికేషన్స్, పనితీరు పరంగా చూస్తే.. ఐఫోన్ 13, ఐఫోన్ 14 మధ్య పెద్ద తేడా ఉండదు. కాబట్టి తక్కువ ధరకు లభించే ఐఫోన్ 13 తీసుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. ఐఫోన్ 15 విషయానికొస్తే.. ఇందులో ఏ16 చిప్, 48 ఎంపీ కెమెరా వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. కాబట్టి మరే ఐఫోన్‌తో దీన్ని పోల్చలేము. బడ్జెట్ ఉంటే ఐఫోన్ 15 తీసుకోవచ్చు. ఇక ఐఫోన్ 12, 64 జీబీ తీసుకోవాలనుకునేవాళ్లు మరో రూ. 8,000 అదనంగా పెట్టి ఐఫోన్ 13,128 జీబీ తీసుకోవడం బెటర్. ఐఫోన్ 12 తో పోలిస్తే ఐఫోన్ 13 లో బెటర్ పెర్ఫామెన్స్ ఉంటుంది. అదనంగా స్టోరేజ్ లభిస్తుంది.