వచ్చే ఏడాది రాబోయే ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు!
ఈ ఏడాది జరిగిన సేల్స్, అందుబాటులోకి వచ్చిన 5జీ నెట్‌వర్క్‌ను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు 2023లో తమ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మొబైళ్లను రిలీజ్ చేయబోతున్నాయి.
మరికొద్ది రోజుల్లో 2022 ఏడాది ముగియనుంది. ఈ ఏడాది రకరకాల స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో హల్‌చల్ చేశాయి. అయితే ఈ ఏడాది జరిగిన సేల్స్, అందుబాటులోకి వచ్చిన 5జీ నెట్‌వర్క్‌ను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు 2023లో తమ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మొబైళ్లను రిలీజ్ చేయబోతున్నాయి. వాటిలో కొన్ని బెస్ట్ మొబైల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రెడ్ మి నోట్ 12 సిరీస్ :
రెడ్‌మి నోట్ 12 సిరీస్ నుంచి వచ్చే ఏడాది మూడు ఫోన్‌లు భారత మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇవి జనవరి 5న విడుదల అవ్వొ్చ్చని టాక్. ఈ సిరీస్ లో నోట్12 , నోట్ 12 ప్రో, నోట్ 12 ప్రో ప్లస్ ఫోన్లు ఉండబోతున్నాయి. ఇందులో 6.67-అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే , డాల్బీ విజన్ వంటి ఫీచర్లుంటాయి. ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది 200వాట్ ఛార్జింగ్ సపోర్టుతో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది.
వన్ ప్లస్ 11 సిరీస్ :
వన్ ప్లస్ నుంచి మరో ఫ్లాగ్‌షిప్ సిరీస్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న లాంచ్ కానుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌ని ఉపయోగించారు. ఇందులో100 వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్టుతో పాటు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. వాటర్ రెసిస్టెంట్ రేటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉంటాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
ఐకూ 11 సిరీస్ :
ఐకూకి చెందిన మరో ఫ్లాగ్‌షిప్ ఫోన్ 'ఐకూ 11' జనవరి 10న వస్తోంది. 'ఐకూ 11' లో.. 6.78-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ ఉపయోగించారు. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ.. 120వాట్ ఛార్జింగ్ స్పీడ్‌ను సపోర్ట్ చేస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్23
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శాంసంగ్ నుంచి 'ఎస్ 23' మొబైల్ రిలీజయ్యే అవకాశం ఉంది. ఇది శాంసంగ్ అందించే అన్ని ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను కలిగి ఉంటుందని టాక్. ఈ ఫోన్ లాంచింగ్ డేట్‌ను శాంసంగ్ అధికారికంగా వెల్లడించలేదు.
ఇక వీటితో పాటు ఆపిల్ , గూగుల్ వంటి కంపెనీలు కూడా వచ్చే ఏడాది కొన్ని ప్రీమియం ఫోన్‌లను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ ఏడాదితో పోలిస్తే వచ్చే ఏడాది ఎక్కువ 5జీ మొబైళ్లు, బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు రిలీజయ్యే అవకాశం ఉంది.