Telugu Global
Science and Technology

ఐఫోన్ 15తో పాటు సెప్టెంబరులో రిలీజయ్యే బెస్ట్‌ ఫోన్లు ఇవే..

ఈ నెలలో ప్రముఖ మొబైల్ కంపెనీలన్నీ తమ లేటెస్ట్ మొబైల్స్‌ను రిలీజ్ చేయనున్నాయి. యాపిల్, శాంసంగ్ వంటి ఫ్లాగ్‌షిప్ ఫోన్లతో పాటు మిడ్ రేంజ్ 5జీ ఫోన్లు కూడా లాంఛ్ అవ్వబోతున్నాయి.

ఐఫోన్ 15తో పాటు సెప్టెంబరులో రిలీజయ్యే బెస్ట్‌ ఫోన్లు ఇవే..
X

ఐఫోన్ 15తో పాటు సెప్టెంబరులో రిలీజయ్యే బెస్ట్‌ ఫోన్లు ఇవే..

ఈ నెలలో ప్రముఖ మొబైల్ కంపెనీలన్నీ తమ లేటెస్ట్ మొబైల్స్‌ను రిలీజ్ చేయనున్నాయి. యాపిల్, శాంసంగ్ వంటి ఫ్లాగ్‌షిప్ ఫోన్లతో పాటు మిడ్ రేంజ్ 5జీ ఫోన్లు కూడా లాంఛ్ అవ్వబోతున్నాయి. వాటిపై ఓ లుక్కేస్తే..

అన్నింటికంటే ముందుగా ఈ నెల 12వ తేదీన ఐఫోన్ 15 లాంచ్ ఈవెంట్‌ జరగబోతోంది. కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్‌లో ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లు లాంఛ్ అవ్వబోతున్నాయి. ఈ ఈవెంట్‌లో యాపిల్ సంస్థ.. తమ లేటెస్ట్ ఐఫోన్ సిరీస్‌లో భాగంగా.. ఐ-ఫోన్ 15, ఐ-ఫోన్15 ప్లస్, ఐ-ఫోన్ 15 ప్రో, ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లను రిలీజ్ చేయబోతుంది.

ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్‌లో లేటెస్ట్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండబోతోంది. అలాగే వీటిలో యూఎస్‌బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్స్‌లో సరికొత్త గ్రే, బ్లూ కలర్ ఆప్షన్లు ఉండబోతున్నాయి. ఈ మోడల్స్ అన్నీ డైనమిక్ ఐలాండ్ నాచ్ డిజైన్‌ను కలిగి ఉంటాయని టాక్. ఈ ఫోన్లకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఐఫోన్ సిరీస్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్9, ఆపిల్ వాచ్ ఆల్ట్రా2, ఐఓఎస్ 17, వాచ్ ఓఎస్ 10 కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

ఇకపోతే సెప్టెంబర్ నెలలో శాంసంగ్‌ ‘గెలాక్సీ ఎస్‌23 ఎఫ్ఈ’ మొబైల్ రాబోతోంది. 6.4-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డైనమిక్ ఎమోలెడ్ డిస్‌ప్లేతో పాటు50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరాతో ఈ ఫోన్ లాంఛ్ అవ్వనుంది.

మోటోరొలా బ్రాండ్ నుంచి మోటో జీ54 5జీ స్మార్ట్‌ఫోన్‌ కూడా ఇదే నెలలో రిలీజవ్వనుంది. 6.5-అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్‌ప్లేతో పాటు 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, 50 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లు దీని ప్రత్యేకతలు.

అలాగే ఈ నెలలో హానర్‌ బ్రాండ్ హానర్ 90 మొబైల్‌తో భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇవ్వనుంది. వీటితోపాటు టెక్నో పోవా 5, పోవా 5 ప్రో 5జీ వంటి బడ్జెట్ ఫోన్లు, వన్ ప్లస్ ఓపెన్, షావోమీ 13టీ వంటి మొబైల్స్ కూడా మార్కెట్లోకి రాబోతున్నాయి.

First Published:  3 Sept 2023 9:00 AM IST
Next Story