Best Smartphones | రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. నేటి అర్ధరాత్రి నుంచే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు.. !
Best Smartphones | భారత్ గణతంత్ర దినోత్సవం.. సంక్రాంతి పండుగలను కలుపుతూ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్.. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Amazon Great Republic Day Sale) తీసుకొచ్చింది.

Best Smartphones | భారత్ గణతంత్ర దినోత్సవం.. సంక్రాంతి పండుగలను కలుపుతూ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్.. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Amazon Great Republic Day Sale) తీసుకొచ్చింది. శనివారం నుంచి ప్రారంభమయ్యే ఈ సేల్‌తో విస్తృత శ్రేణి స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు, డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది అమెజాన్. ఈ తరుణంలో మీరు మీ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారా.. రూ.20 వేల లోపు ధరలో పలు రకాల మోడల్స్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ మొదలు శాంసంగ్, ఐక్యూ, రియల్‌మీ తదితర ఫోన్లపై భారీ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు ప్రస్తుతం వాడుతున్న పాత స్మార్ట్‌ఫోన్ మీద కూడా అదనపు డిస్కౌంట్‌లు అందిస్తోంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ తన ప్రైమ్ సబ్‌స్క్రైబర్ల కోసం శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు.. సాధారణ కస్టమర్లకు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులోకి తెస్తున్నది. అమెజాన్ తన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఆఫర్ల కోసం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)తో పార్టనర్‌షిప్ కుదుర్చుకున్నది. ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా 10 శాతం వరకూ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తున్నది.
రెడ్‌మీ నోట్ 13 5జీ, వివో వై56, ఐటెల్ ఎస్23+, రియల్‌మీ నార్జో 60 5జీ, ఐక్యూ జడ్6 లైట్ 5జీ తదితర ఫోన్లపై భారీ ధరల తగ్గింపు ఆఫర్లు ప్రకటించింది. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఇటీవల మార్కెట్‌లో ఆవిష్కరించిన ఒప్పో ఏ59 5జీ ఫోన్ మీద ధర ఆఫర్ లభిస్తుంది. ఎక్స్‌నోస్ 1330 ఎస్వోసీ చిప్‌సెట్‌తో పని చేసే శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ ఫోన్ సైతం డిస్కౌంట్‌పై సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్స్‌తో లభించే సాధారణ డిస్కౌంట్లతోపాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లు.. వాటిపై కొనుగోలు చేస్తే పది శాతం వరకూ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. స్మార్ట్ ఫోన్ల ప్రేమికులు తమ పాత స్మార్ట్ ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్లతోపాటు ఈఎంఐ ఆప్షన్లు, కూపన్ డిస్కౌంట్లూ అందుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్-2024కి ఒక రోజు ముందే అందుబాటులోకి వచ్చిన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్స్‌లో రూ.20 వేల లోపు ధర గల బెస్ట్ స్మార్ట్‌ఫోన్లపై ఆసక్తికర డీల్స్ లభిస్తున్నాయి. ఫోన్లు కొనుగోలు చేసే ముందుకు ధరలు, వాటిపై ఆఫర్ల గురించి తెలుసుకోండి..
రూ.20 వేల లోపు ధరకు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..
ఫోన్ పేరు ------- ------ ------ ఎంఆర్‌పీ ---- డీల్ ధర
రెడ్‌మీ నోట్ 13 5జీ --- ----- రూ..17,999 --- రూ.16,999
వివో వై28 5జీ ----- ---- ------ రూ. 17,999 --- రూ. 12,999
ఐటెల్ ఎస్23+ ------ ------- రూ.17,299 ---- రూ.12,999
రియల్‌మీ నార్జో60 5జీ ----- రూ. 19,999 ---- రూ.15,499
ఐక్యూ జడ్7ఎస్ 5జీ --- ---- రూ.23,999 ----- రూ.14,999
ఒప్పో ఏ59 5జీ ------- ------- రూ.17,999 ----- రూ. 12,999
శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ- రూ.18,999 ----- రూ.13,499
వివో వై 56 ------- ------ ------ రూ.24,999 ----- రూ. 14,999