Telugu Global
Science and Technology

పదివేల బడ్జెట్‌లో కొనదగిన బెస్ట్ ఫోన్స్ ఇవే!

పదివేల రూపాయల బడ్జెట్‌లో ప్రస్తుతం చాలారకాల ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో కెమెరా, డిస్‌ప్లే, ప్రాసెసర్ వంటి అంశాల్లో బెస్ట్‌గా రాణిస్తున్న మొబైల్స్ ఇవీ.

పదివేల బడ్జెట్‌లో కొనదగిన బెస్ట్ ఫోన్స్ ఇవే!
X

మార్కెట్లో ప్రతినెలా కొత్త మొబైల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి కొత్తగా మొబైల్స్ కొనాలనుకునేవారికి ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఆప్షన్స్ రెడీగా ఉంటాయి. ప్రస్తుతం పదివేల రూపాయల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేస్తే..

పదివేల రూపాయల బడ్జెట్‌లో ప్రస్తుతం చాలారకాల ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో కెమెరా, డిస్‌ప్లే, ప్రాసెసర్ వంటి అంశాల్లో బెస్ట్‌గా రాణిస్తున్న మొబైల్స్ ఇవీ..

శాంసంగ్ ఎ14 5జీ

పదివేల రూపాయల బడ్జెట్‌లో ఓవరాల్ బెస్ట్ ఫోన్‌గా ‘శాంసంగ్​ గెలాక్సీ ఎ14’ మొబైల్‌ను చెప్పుకోవచ్చు. ఇందులో 6.6 అంగుళాల ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. శాంసంగ్ ఎగ్జినోస్​ 1330 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. 13 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు వెనుక 50 ఎంపీ ప్రైమరీ కెమెరా రెండు 2 ఎంపీ డెప్త్ సెన్సర్‌‌లు ఉన్నాయి. ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. క్రోమా స్టోర్‌‌లో ఈ మొబైల్ ధర సుమారు రూ.11,599 ఉంది.




రియల్‌మీ సీ67 5జీ

పదివేల బడ్జెట్‌లో మంచి పెర్ఫామెన్స్ ఫోన్ కావాలంటే ‘రియల్‌మీ సీ67’ మొబైల్ తీసుకోవచ్చు. ఇందులో 6.72 అంగుళాల ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 ఎంపీ డెప్త్ సెన్సర్, సెల్ఫీల కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ కెపాసిటీ 5000 ఎంఏహెచ్. ధర సుమారుగా రూ.11,210 ఉంది.




పోకో ఎమ్ 6 5జీ

బడ్జెట్లో మంచి పెర్ఫామెన్స్‌తో పాటు మంచి కెమెరా సెటప్ ఉండే ఫోన్ కావాలనుకునేవారు ‘పోకో ఎమ్ 6’ స్మార్ట్​ఫోన్ ఎంచుకోవచ్చు. ఇందులో 6.79 అంగుళాల ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. క్వాల్‌కామ్​ స్నాప్​డ్రాగన్​ 4 జెన్​ 2 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 ఎంపీ డెప్త్ సెన్సర్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ధర సుమారు రూ.10,899 ఉంది.



మోటో జీ34 5జీ

తక్కువ బడ్జెట్‌లో ప్రాక్టికల్ మొబైల్ కావాలనుకుంటే ‘మోటో జీ34’ ఫోన్​ పై ఓ లుక్కేయొచ్చు. ఇందులో 6.5 అంగుళాల ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 695 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఇందులో 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2ఎంపీ డెప్త్ సెన్సర్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ కెపాసిరీ 5000 ఎంఏహెచ్. ఈ మొబైల్ ధర సుమారు రూ.11,585 ఉంది.




లావా బ్లేజ్ 2 5జీ

తక్కువ బడ్జెట్‌లో ఇండియన్ మొబైల్ కొనాలనుకునేవారు ‘లావా బ్లేజ్​ 2 5జీ’ తీసుకోవచ్చు. ఇందులో 6.56 అంగుళాల ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ 5000 ఎంఏహెచ్. ధర సుమారు రూ.9,999 ఉంది.





First Published:  18 March 2024 4:05 PM IST
Next Story