Telugu Global
Science and Technology

ఆన్‌లైన్ ఫ్రెండ్స్‌తో జాగ్రత్త!

సోషల్ మీడియాలో పరిచయమై ఆ తర్వాత మంచి స్నేహితులుగా మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే ఫ్రెండ్‌షిప్ పేరుతో ఆన్‌లైన్‌లో మోసాలు జరిగిన సందర్భాలూ ఉన్నాయి.

ఆన్‌లైన్ ఫ్రెండ్స్‌తో జాగ్రత్త!
X

సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిన ఈ రోజుల్లో చాలామంది ఆన్‌లైన్‌లో ఫ్రెండ్‌షిప్స్ చేస్తుంటారు. గుర్తు తెలియని వ్యక్తులతో మాటా మంతీ కలుపుతూ దగ్గరవుతుంటారు. అయితే ఇలాంటి ఆన్‌లైన్ ఫ్రెండ్‌షిప్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే..

సోషల్ మీడియాలో పరిచయమై ఆ తర్వాత మంచి స్నేహితులుగా మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే ఫ్రెండ్‌షిప్ పేరుతో ఆన్‌లైన్‌లో మోసాలు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి సోషల్ మీడియా ఫ్రెండ్‌షిప్ విషయంలో ఓకింత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆన్‌లైన్ స్నేహాల్లో గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటంటే..

ఇటీవల జరిగిన ఓ సర్వే రిపోర్ట్ ప్రకారం యువతలో 76 శాతం మంది సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. వీరిలో చాలామంది పక్కన ఉండే రియల్ ఫ్రెండ్స్ కంటే సోషల్‌ మీడియా ఫ్రెండ్‌తోనే నిజాయితీగా ఉంటున్నారట. అంటే పక్కన ఉండే ఫ్రెండ్‌తో షేర్ చేసుకోని విషయాలు కూడా ఆన్‌లైన్‌లో షేర్ చేసుకుంటున్నారు. దీనివల్ల ప్రైవసీ ఇబ్బందులు తలెత్తొచ్చు. కొంతమంది మోసగాళ్లు ఫేక్ ప్రొఫైల్స్ సాయంతో టీనేజర్ల పర్సనల్ విషయాలు తెలుసుకుని డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పర్సనల్ విషయాలు, ఫొటోలు ఎవరితో షేర్ చేసుకోకూడదు.

ఒక వ్యక్తిని నేరుగా కలిసే వరకూ అతనిపై పూర్తి నమ్మకం పెట్టుకోవడం అంత మంచిదికాదని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నప్పటికీ కొన్ని లిమిట్స్ పెట్టుకోవడం మంచిది. డబ్బు సాయం చేయడం, అప్పు ఇవ్వడం, జాబ్ రికమెండేషన్స్ చేయడం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే తెలియని వ్యక్తులను మొదటిసారి కలిసేటప్పుడు కూడా వెంట ఎవరినైనా తీసుకెళ్లడం మంచిది.

First Published:  23 Aug 2024 10:51 AM GMT
Next Story