Apple | ఆపిల్ దాతృత్వం.. భారత్‌లో 78 వేల మందికి సొంతింటి ఫెసిలిటీ..!
Apple | రెండున్నరేండ్లుగా భారత్‌లో నేరుగా 1.50 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కల్పించడంతో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ తరుణంలోనే భారత్‌లో తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు ఉపాధి కల్పించడంతోపాటు ఆపిల్-భారత్ ఉద్యోగులందరికీ సొంతింటి కల సాకారం చేసేందుకు సిద్ధమైంది.
Apple | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్.. ఐ-ఫోన్‌లు, లాప్‌టాప్‌లు, మ్యాక్‌బుక్‌లు, టాబ్లెట్లు తమ కస్టమర్లకు అందించడంలో ముందు పీఠినే నిలుస్తూ వస్తోంది. అతిపెద్ద మార్కెట్‌గా నిలుస్తున్న భారత్ నుంచే వాటి ఉత్పత్తికి సిద్ధమవుతున్నది. రెండున్నరేండ్లుగా భారత్‌లో నేరుగా 1.50 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కల్పించడంతో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ తరుణంలోనే భారత్‌లో తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు ఉపాధి కల్పించడంతోపాటు ఆపిల్-భారత్ ఉద్యోగులందరికీ సొంతింటి కల సాకారం చేసేందుకు సిద్ధమైంది.
ఆపిల్ తమ సంస్థ పురోభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడంతోపాటు అందరి సంక్షేమం, సెక్యూరిటీ, సమర్ధత పెంపు లక్ష్యంతో ముందుకు సాగుతున్నది. చైనా, వియత్నాం వంటి దేశాల్లో ఇదే తరహాలో ఆపిల్ తమ ఉద్యోగులకు ఇంటి వసతి కల్పిస్తున్నది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 78 వేలకు పైగా ఇండ్ల నిర్మాణానికి పూనుకున్నదని ఒక ఆంగ్ల దిన పత్రికలో వార్తాకథనం ప్రచురితమైంది. ఆపిల్ సప్లయర్ సంస్థ ఫాక్స్‌కాన్ ఐ-ఫోన్ తయారీ యూనిట్ తమిళనాడులో మెజారిటీ.. సుమారు 58 వేల ఇండ్లు నిర్మించనున్నది.
ఆపిల్ ఉద్యోగులకు ఇంటి వసతులు కల్పించే బృహత్తర కార్యక్రమంలో కొన్ని ముఖ్యమైన సంస్థలు చేయూతనిస్తున్నాయి. తమిళనాడు రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీసీఓటీ), టాటా గ్రూప్, ఎస్పీఆర్ ఇండియా వంటి సంస్థలు పాలు పంచుకుంటున్నాయి. సకాలంలో ప్రాజెక్టు పూర్తయి.. అందరికీ ఇండ్లు అందించేందుకు మనీ కూడా పెట్టుబడి పెడుతున్నాయి. కేంద్రంతోపాటు తమిళనాడు, ఆపిల్ ఉద్యోగులు పని చేస్తున్న రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, కొందరు వ్యాపారవేత్తలు కూడా తమ వంతు సాయం అందిస్తున్నాయి. 2025 మార్చి 31 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నది ఆపిల్.
ఫ్యాక్టరీలకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పని చేస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని ఆపిల్ `ఇండ్ల నిర్మాణ ప్రాజెక్ట్`కు శ్రీకారం చుట్టింది. అందునా 19-24 ఏండ్ల మధ్య వయస్సు గల యువతుల భద్రతకు పెద్దపీట వేస్తున్నదీ గ్లోబల్ టెక్ దిగ్గజం. ఇటువంటి వారందరి కోసం ఫ్యాక్టరీల సమీపాన ఇండ్లు నిర్మించాలని సంకల్పించింది ఆపిల్. తన ఉద్యోగులకు చేయూతనివ్వాలని ఆపిల్ కోరుకుంటున్నది. ప్రస్తుతం ఉద్యోగులంతా సుదూర ప్రాంతాల్లోని అద్దె ఇండ్లలో నివాసం ఉంటూ పని చేయడానికి కంపెనీకి వస్తున్నారు.
ఆపిల్, ఫాక్స్‌కాన్ తరహాలోనే టాటా ఎలక్ట్రానిక్స్, సాల్కోఎంపీ కూడా తమ ఉద్యోగులకు సొంత ఇండ్ల నిర్మాణ పనులు చేపట్టాయి. కేవలం ఒక్క దేశానికి, ఒక్క ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా వివిధ చోట్ల ఉత్పత్తులను తయారు చేయాలని ఆపిల్ భారీ ప్రణాళిక రూపొందించుకున్నది. ఆపిల్ వంటి సంస్థలు తమ ఉద్యోగులు సుఖమయం జీవనం సాగించడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఉద్యోగుల్లో అసంతృప్తి నివారించడానికి, సమస్యల పరిష్కారానికి ఇండ్ల నిర్మాణం చేపడుతున్నాయి.