Telugu Global
Science and Technology

యాపిల్ ఐఓఎస్ 18 వచ్చేస్తోంది! కొత్త ఫీచర్లివే..

ఐఫోన్ యూజర్లకు కొత్త అప్డేట్ రాబోతోంది. త్వరలోనే ఐఓఎస్ 18 వెర్షన్ అందుబాటులోకి రానున్నట్టు యాపిల్ అఫీషియల్ అనౌన్స్ చేసింది. ఈ కొత్త వెర్షన్‌లో ఏమేం ఫీచర్లుంటాయంటే.

యాపిల్ ఐఓఎస్ 18 వచ్చేస్తోంది! కొత్త ఫీచర్లివే..
X

ఐఫోన్ యూజర్లకు కొత్త అప్డేట్ రాబోతోంది. త్వరలోనే ఐఓఎస్ 18 వెర్షన్ అందుబాటులోకి రానున్నట్టు యాపిల్ అఫీషియల్ అనౌన్స్ చేసింది. ఈ కొత్త వెర్షన్‌లో ఏమేం ఫీచర్లుంటాయంటే..

రీసెంట్‌గా జరిగిన ‘యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్​ కాన్ఫరెన్స్’లో యాపిల్ సంస్థ ఐఓఎస్‌ 18 గురించి అనౌన్స్ చేసింది. ఈ కొత్త ఐఓఎస్‌లో ఎలాంటి లేటెస్ట్ ఫీచర్లను ఇంట్రడ్యూస్‌ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఓఎస్‌18లో హోమ్‌ స్క్రీన్‌ కస్టమైజేషన్‌ అనే ఫీచర్‌ కనిపించనుంది. ఈ ఫీచర్ సాయంతో ఐఫోన్స్‌లో కూడా ఆండ్రాయిడ్ మాదిరిగా యాప్ ఐకాన్స్‌ను హోమ్ స్క్రీన్ పై నచ్చిన చోట పెట్టుకునే వీలుంటుంది.

ఐఓఎస్ 18 లో యూజర్లు యాప్ ఐకాన్స్ డిజైన్‌ను కూడా నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. వాల్‌పేపర్ లేదా థీమ్ ఆధారంగా ఐకాన్‌ కలర్‌ను మార్చుకోవచ్చు.

సరికొత్త ఐఓఎస్ 18లో షెడ్యూల్ మెసేజెస్ అనే ఫీచర్ రానుంది. ఐఫోన్ యూజర్లు మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకోవడం ద్వారా సెట్ చేసిన టైం ప్రకారం ఆటోమేటిక్‌గా మెసేజ్‌లు సెండ్ అవుతాయి. దీంతోపాటు టెక్స్ట్ ఫార్మాటింగ్ ఫీచర్లు కూడా రానున్నాయి.

ఐఓఎస్ 18 లో యాపిల్‌ వాలెట్ పేరుతో సరికొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. రెండు ఐఫోన్స్‌ను ట్యాప్‌ చేయడం ద్వారా ఒక వ్యాలెట్ నుంచి మరో వ్యాలెట్‌కి ఈజీగా క్యాష్‌ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

ఐఓఎస్‌ 18లో యాప్స్‌ను హైడ్‌ చేసుకునే ఫీచర్ కూడా ఉంటుంది. యూజర్లు ఫేస్ ఐడీ లేదా పాస్‌వర్డ్ ద్వారా యాప్స్ కనిపించకుండా దాచుకోవచ్చు. అలాగే మెయిల్‌ యాప్‌ ద్వారా రకరకాల మెయిల్స్‌ను ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు.

ఇకపోతే లేటెస్ట్ ఐఓఎస్‌లో యూజర్లు ఫోటోలు, వీడియోలను మరింత మెరుగ్గా మేనేజ్ చేసుకునే విధంగా టూల్స్ ఉండనున్నాయి. వీటితోపాటు మరికొన్ని ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అప్‌డేట్స్, వైర్‌‌లెస్ డివైజెస్‌కు యాక్సెస్‌ కంట్రోల్స్, ఎమర్జెన్సీ ఎస్‌ఓఎస్ వంటి ఫీచర్స్‌ కూడా ఉన్నాయి.

First Published:  13 Jun 2024 2:45 AM GMT
Next Story