ఐఫోన్ యూజర్లు ఇలా చేయొద్దట.. యాపిల్ అలర్ట్!
రీసెంట్‌గా యాపిల్ సంస్థ.. ఐఫోన్ యూజర్లకు కొన్ని సూచనలు చేసింది. మొబైల్ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
రీసెంట్‌గా యాపిల్ సంస్థ.. ఐఫోన్ యూజర్లకు కొన్ని సూచనలు చేసింది. మొబైల్ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
నిద్రపోయేటప్పుడు మొబైల్‌ను తల పక్కనే పెట్టుకునే అలవాటుంటుంది చాలామందికి. అలాగే మరికొంతమంది ఫోన్‌ని తల దగ్గర పెట్టుకుని దానికి చార్జింగ్ పెట్టేసి, అలాగే వదిలేస్తుంటారు. ఇలా మొబైల్ ఛార్జింగ్ పెట్టి తల పెట్టుకోవడం వల్ల కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని సైంటిస్టుల కనుగొన్నారు. తాజాగా యాపిల్ సంస్థ కూడా ఇదే విషయంపై ఐఫోన్ యూజర్లకు కొన్ని సూచనలు చేసింది.
నిద్రించేటప్పుడు ఫోన్‌ను పక్కనే పెట్టుకోవద్దని, అలాగే ఛార్జింగ్ పెట్టి అలాగే వదిలేయొద్దని యాపిల్ సంస్థ యూజర్లను హెచ్చరించింది. మొబైల్ ఛార్జ్ చేసేటప్పుడు వెలుతురు ఉన్న వాతావరణంలో, ఫ్లాట్‌గా ఉండే టేబుల్‌పై పెట్టి ఛార్జింగ్ పెట్టాలని సూచించింది. దుప్పట్ల పైన, దిండ్ల కింద అలాగే శరీరం మీద ఫోన్ ఉంచి ఎట్టిపరిస్థితుల్లోనూ ఛార్జ్ చేయొద్దని హెచ్చరించింది. అంతేకాదు.. ఫోన్‌ని ఛార్జ్ చేస్తున్నప్పుడు దాన్ని వాడొద్దని కూడా సూచించింది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సి వస్తే.. ఛార్జింగ్ తీసేసి వాడమని, అలాగే దెబ్బతిన్న కేబుల్స్, ఛార్జర్లను ఉపయోగించొద్దని సూచించింది.
సాధారణంగా ఫోన్ చార్జ్ అవుతున్నప్పుడు కొంత వేడి జనరేట్ అవుతుంది. ఆ వేడి సహజంగా బయటకు విడుదలవ్వాలంటే, దాన్ని ఓపెన్ ప్లేస్‌లో ఉంచాల్సి ఉంటుంది. అలా కాకుండా దాన్ని దుప్పట్లు, దిండుతో కప్పేస్తే.. ఫోన్ కింది భాగం కాలిపోవచ్చు లేదా కొన్ని సందర్భాల్లో పేలిపోవచ్చు కూడా. అందుకే.. ఫోన్‌ను చార్జ్ చేస్తున్నప్పుడు దానికి గాలి ఆడేలా టేబుల్‌పై పెట్టి తలకు కాస్త దూరంగా పెట్టుకోవాలి.