Amazon Mega Electronics Days Sale | అమెజాన్ బంపరాఫర్.. లాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్లపై 80 శాతం వరకూ డిస్కౌంట్లు.. !
Amazon Mega Electronics Days Sale | ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ మరోమారు తన కస్టమర్ల కోసం అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్స్ (Amazon Mega Electronics Days Sale) తీసుకొచ్చింది. లాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్ వాచ్‌లు తదితరాలపై 80 శాతం వరకూ డిస్కౌంట్ ధరలకే అందిస్తోంది.
Amazon Mega Electronics Days Sale | ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ మరోమారు తన కస్టమర్ల కోసం అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్స్ (Amazon Mega Electronics Days Sale) తీసుకొచ్చింది. లాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్ వాచ్‌లు తదితరాలపై 80 శాతం వరకూ డిస్కౌంట్ ధరలకే అందిస్తోంది. దీంతోపాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్/ డెబిట్ కార్డు, జమ్ముకశ్మీర్ బ్యాంక్ క్రెడిట్/ డెబిట్ కార్డులపై కొనుగోలు చేసే కస్టమర్లకు అదనపు డిస్కౌంట్లు లభిస్తాయి. ఈ నెల 18 నుంచి అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్స్ ప్రారంభం కానున్నది.
ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్/ డెబిట్ కార్డు, జమ్ముకశ్మీర్ బ్యాంక్ క్రెడిట్/ డెబిట్ కార్డులపై కొనుగోలు చేసే వారికి పది శాతం డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్ల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.5000 వరకూ డిస్కౌంట్ లభ్యం అవుతుంది.
అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్స్‌లో భాగంగా గేమింగ్ లాప్‌టాప్‌లు డిస్కౌంట్ ధరలకే లభిస్తాయి. ఉదాహరణకు 15.6 అంగుళాల ఐపీఎస్ స్క్రీన్ (15.6-inch IPS screen), 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ (12th generation Intel Core i5 processor), నివేదియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 3050 జీపీయూ (Nvidia GeForce RTX 3050 GPU)తో వస్తున్న హెచ్‌పీ విక్టస్ గేమింగ్ లాప్‌టాప్ (HP Victus gaming laptop) కేవలం రూ.68,900లకే లభిస్తుంది.
11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ4 సీపీయూ (11th Gen Intel Core i5 CPU), ఆర్టీఎక్స్ 2050 జీపీయూ (RTX 2050 GPU) తో వస్తున్న అసుస్ టీయూఎఫ్ ఎఫ్17 (Asus TUF F17) గేమింగ్ లాప్‌టాప్ రూ.77,990 నుంచి రూ.49,990లకు దిగి వచ్చింది.
12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 సీపీయూ(12th Gen Intel Core i5 CPU),16 జీబీ ర్యామ్‌తో వస్తున్న హెచ్‌పీ 15ఎస్ (HP 15s) లాప్‌టాప్ ఎంఆర్‌పీ రూ.69,223 కాగా, రూ.53,990లకే లభిస్తుంది.
11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 సీపీయూ (11th Gen Intel Core i7 CPU), 512 జీబీ ఎస్ఎస్‌డీ (512GB SSD)తో వస్తున్న లెనోవో ఐడియా పాడ్ స్లిమ్ 3 (Lenovo IdeaPad Slim 3) లాప్‌టాప్ ధర రూ.79,690 కాగా, రూ.59,990లకే సొంతం చేసుకోవచ్చు.
ఎం1 చిప్ (M1 chip), లిక్విడ్ రెటినా డిస్‌ప్లే (Liquid Retina display)తో వస్తున్న పిఫ్త్ జనరేషన్ ఐపాడ్ ఎయిర్ (iPad Air -5th generation) ఐపాడ్ రూ.59,900 నుంచి రూ.53,999లకు తగ్గింపు.
ఎస్ పెన్ (S Pen)తోపాటు వస్తున్న శాంసంగ్ గెలాక్సీ టాబ్ ఎస్6 లైట్ (Samsung Galaxy Tab S6) ధర రూ.30,999 కాగా, రూ.8000 డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది.
గోప్రో హీరో 12 (GoPro Hero 12) కెమెరా లాంచింగ్ ధర రూ.45 వేలు కాగా, తాజా సేల్‌లో రూ.37,990లకే లభ్యం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మోషన్ డిటెక్షన్ (AI-based motion detection), నైట్ విజన్ సపోర్ట్ (night vision support)తో వస్తున్న షియోమీ ఎంఐ360 హోం సెక్యూరిటీ కెమెరా 2కే (Xiaomi's Mi 360 Home Security Camera 2K) ధర రూ.4,999 కాగా, రూ.2999లకే సొంతం చేసుకోవచ్చు.
సోనీ పాపులర్ డబ్ల్యూహెచ్-1000ఎక్స్ఎం4 హెడ్ ఫోన్ (WH-1000XM4 headphones) ధర రూ.22,990 కాగా, రూ.19,990లకే లభ్యం. ఈ హెడ్ ఫోన్లకు 30 గంటల బ్యాటరీ లైఫ్, యాక్టీవ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ ఉంటది.
సోనీ హెడ్ ఫోన్ల మాదిరే బోస్ క్వైట్ కంఫర్ట్ 45 హెడ్ ఫోన్ రూ.29,900 నుంచి రూ.19,900లకు తగ్గింపు.
ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్ పోన్స్ జేబీఎల్ వేవ్ ఫ్లెక్స్ (JBL Wave Flex) ధర రూ.4,999 కాగా, రూ.2,998లకే లభ్యం.