Amazon Great Summer Sale | మే2 నుంచి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ షురూ.. 80 శాతం వరకూ డిస్కౌంట్లు..!
Amazon Great Summer Sale | ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ డేస్ వచ్చేశాయి. ఆన్‌లైన్ సేల్స్ మే రెండో తేదీ నుంచి ప్రారంభం అవుతాయి.

Amazon Great Summer Sale | ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ డేస్ వచ్చేశాయి. ఆన్‌లైన్ సేల్స్ మే రెండో తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. వేర్వేరు ఉత్పత్తులపై వందల డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంతకుముందు మాదిరిగానే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు 12 గంటల ముందు డిస్కౌంట్ సేల్స్ అందుబాటులో ఉంటాయి. మొబైల్ ఫోన్స్, యాక్సెసరీస్, బ్యూటీ అండ్ ఫ్యాషన్ ఐటమ్స్, లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, స్మార్ట్ వాచీలు, ఇయర్ బడ్స్, స్మార్ట్ టీవీలపై ఆఫర్లు అందిస్తోంది అమెజాన్. ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, వన్ కార్డు క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేయడంతో అదనపు డిస్కౌంట్లు పొందొచ్చు.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకు ఒకటో తేదీ అర్థరాత్రి 12 గంటల తర్వాత సేల్స్ మొదలవుతాయి. మొబైల్ ఫోన్స్, వాటి విడి భాగాలపై 45 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. వన్‌ప్లస్, రెడ్‌మీ, రియల్‌మీ వంటి ఫోన్లపై ధరలు తగ్గిస్తారు. వన్‌ప్లస్ 11ఆర్, రెడ్‌మీ 13సీ, ఐక్యూ జడ్6 లైట్, రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ, రెడ్‌మీ 12 5జీ ఫోన్‌లపై ధరల తగ్గింపు ఉంది. కానీ ఏయే ఫోన్‌పై ఎంతెంత డిస్కౌంట్ లభిస్తుందన్న విషయం అధికారికంగా అమెజాన్ ప్రకటించాల్సి ఉంది.
లాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచీలు, హెడ్‌ఫోన్లపై 75 శాతం, టీవీలు, గృహోపకరణాలపై 65 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. సోనీ డబ్ల్యూహెచ్-1000 ఎక్స్ఎం4 వైర్‌లెస్ హెడ్‌ఫోన్లు, అమేజ్‌ఫిట్ యాక్టివ్ స్మార్ట్ వాచ్, ఆపిల్ ఐప్యాడ్ (పదవ జనరేషన్) వంటి మోడల్స్ రాయితీపై లభిస్తాయి. ఇక హోం, కిచెన్ ఉత్పత్తులపై 70 శాతం, ఫ్యాషన్ ఉత్పత్తులపై 50, బ్యూటీ ఉత్పత్తులపై 80 శాతం రాయితీ లభిస్తుంది. అమేజాన్ ఎకో (విత్ అలెక్స్), ఫైర్ టీవీ, కైండిల్ డివైజ్‌లపై 45 శాతం వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేసింది. ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, వన్ కార్డు క్రెడిట్ కార్డులపై అదనంగా 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్లు లభిస్తాయి.