భూమిపై కూలిపోబోతున్న భారీ శాటిలైట్.. సముద్రంలో పడేయడానికి శాస్త్రవేత్తల ప్రయత్నాలు
ప్రస్తుతం ఈ ఉపగ్రహంలోని లేజర్ పరికరాలు ఇంకా పని చేస్తున్నాయి. దీంతో శాటిలైట్‌లో ఇతర పరికరాలను ఏప్రిల్ 30నే నిలిపివేశారు.
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఐదేళ్ల క్రితం ప్రయోగించిన ఏయోలస్ అనే భారీ ఉపగ్రహం త్వరలో భూమిపై కూలిపోబోతున్నది. 1360 కిలోల బరువైన ఈ శాటిలైట్ జీవిత కాలం చివరి అంకానికి చేరుకోవడంతో రీఎంట్రీకి ఈఎస్ఏ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం భూమికి 320 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఉపగ్రహం.. సూర్యుడి నుంచి వస్తున్న ప్లాస్మా గాలుల కారణంగా త్వరగా ఇంధనాన్ని కోల్పోతున్నది. దీంతో ప్రస్తుతం శాటిలైట్‌లో ఫ్యూయల్ కెపాసిటీ దాదాపు తగ్గిపోయింది.
ఒక వైపు ఇంధనం అయిపోతుండటంతో రీఎంట్రీకి చేయాల్సిన దశలను శాస్త్రవేత్తలు మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ ఉపగ్రహంలోని లేజర్ పరికరాలు ఇంకా పని చేస్తున్నాయి. దీంతో శాటిలైట్‌లో ఇతర పరికరాలను ఏప్రిల్ 30నే నిలిపివేశారు. దానికి సంబంధించిన డేటాను పూర్తిగా సేకరించే పనిలో శాస్త్రవేత్తలు ప్రారంభించారు. ఇలా చేయడం వల్ల ఎయోలస్-2 ప్రయోగ సమయంలో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రాబోయే కొన్ని రోజుల్లో ఎయోలస్ తనంతట తానుగా 320 కిలోమీటర్ల ఎత్తు నుంచి 280 కిలోమీటర్ల ఎత్తుకు దిగనున్నది. ఆ తర్వాత శాస్త్రవేత్తలు శాటిలైట్‌లోని పరికరాలను ఉపయోగించి 150 కిలోమీటర్లు ఎత్తుకు దాన్ని దించుతారు. కాగా, భూమి నుంచి 80 కిలోమీటర్ల ఎత్తుకు వచ్చే సరికి శాటిలైట్ దానంతట అదే కాలిపోతుందని యూరోపియన్ ఏజెన్సీ తెలిపింది. ఈ శాటిలైట్ కూలిపోవడం వల్ల దాదాపు ఎవరికీ ఎలాంటి హాని జరగదని స్పష్టం చెప్పారు.
సోలార్ యాక్టివిటీ ఆధారంగానే శాటిలైట్ కూలిపోయే దశలు ఉంటాయని చెప్పారు. అగస్టు చివరి వారంలోగా ఎయోలస్ పూర్తిగా భూమిపై కూలిపోతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. కాగా, భూవాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత దాని దిశను సముద్రం వైపు మళ్లించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని యూరోపియన్ ఏజెన్సీ తెలిపింది. ఒక్క ముక్క కూడా నేలపై పడకుండా పకడ్భందీ చర్యలు తీసుకుంటామని చెప్పారు.
.@esa_aeolus is coming home back to Earth.
— ESA Earth Observation (@ESA_EO) May 8, 2023
This is the FIRST assisted reentry of its kind; here's what is planned ➡️ https://t.co/lC9zChFW00#ByeByeAeolus pic.twitter.com/jQkOiC1oAL