Telugu Global
Science and Technology

త్వరలోనే సూర్యుడి దగ్గరకు ఇస్రో.. ప్రాజెక్ట్ విశేషాలివే..

చంద్రయాన్ ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో ఇస్రో నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై దేశమంతా ఉత్కంఠ నెలకొంది. చంద్రయాన్ 3 తర్వాత ఇస్రో చేయబోతున్న మరో అతిపెద్ద ప్రయోగం ‘ఆదిత్య ఎల్‌-1’.

త్వరలోనే సూర్యుడి దగ్గరకు ఇస్రో.. ప్రాజెక్ట్ విశేషాలివే..
X

త్వరలోనే సూర్యుడి దగ్గరకు ఇస్రో.. ప్రాజెక్ట్ విశేషాలివే..

చంద్రయాన్ ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో ఇస్రో నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై దేశమంతా ఉత్కంఠ నెలకొంది. చంద్రయాన్ 3 తర్వాత ఇస్రో చేయబోతున్న మరో అతిపెద్ద ప్రయోగం ‘ఆదిత్య ఎల్‌-1’. ఈ ప్రాజెక్ట్ విశేషాల్లోకి వెళ్తే..

సూర్యుడిపై అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగిస్తున్న మొట్టమొదటి స్పేస్ షిప్ పేరే ‘ఆదిత్య ఎల్‌-1’. ఈ ప్రయోగం ద్వారా సూర్యుడికి దగ్గరగా స్పేస్ లో ఒక అబ్జర్వేటరీని ఏర్పాటు చేయబోతోంది ఇస్రో. ఈ అబ్జర్వేటరీని సెప్టెంబరు 2న శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి, ‘పీఎస్‌ఎల్‌వీ–ఎక్స్‌ఎల్‌ సీ57’ రాకెట్‌ ద్వారా పంపబోతున్నారు. ఈ రాకెట్ 109 రోజుల పాటు నింగిలో ప్రయాణించి సూర్యుడికి దగ్గరగా వెళ్లి ‘ఎల్ ’1 అనే ఒక పాయింట్‌ వద్ద ఆగుతుంది. అక్కడికి చేరుకున్నాక సూర్యుడి చుట్టూ తిరుగుతూ పరిశోధనలు చేస్తుంది. ఇందులో ఉండే రిమోట్‌ సెన్సింగ్‌ పరికరాలు సూర్యుడి దృశ్యాలను, స్ప్రెక్టమ్‌ను చిత్రీకరిస్తూ నిరంతరాయంగా సూర్యుడి క్షేత్రాన్ని శోధిస్తుంటాయి. ఆదిత్య ఎల్‌1కు అమర్చిన టెలిస్కోప్‌.. సూర్యుడి మీద ఎగసిపడే జ్వాలలు, సౌర తుపాన్ల వంటి వాటిని క్యాప్చర్ చేసి పరిశోధించగలదు. ఇంకా సౌర క్షేత్రాన్ని పరిశోధించడానికి ఉపయోగపడే రకరకాల ఆధునాతర పరికరాలు, సెన్సార్లు ఈ అబ్జర్వేటరీకి అమర్చారు.

సూర్యుడి నుంచి వెలువడే శక్తిని అర్థం చేసుకోవడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే సూర్యుడి ఆవరణంలోకి చేరుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి ఎంతో శ్రమించి ప్రాజెక్ట్‌ను డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇస్రో చేస్తున్నది కూడా అదే. ఎప్పటినుంచో ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తూ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అంతరిక్షంలో సూర్యుడికి దగ్గరగా ఉంటూ సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్స్‌ను నిశితంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. సూర్యుడిపై ఉండే గాలి రేణువులు, సౌర అయస్కాంత క్షేత్రం వంటి అంశాలను పరిశీలించడం ఈ మిషన్ ఉద్దేశం.

సూర్యుడి రహస్యాలను తెలుసుకోవడం ద్వారా ఇతర నక్షత్రాల తీరుని అర్థం చేసుకోవటం తేలికవుతుంది. అలాగే భూమిపై సూర్యుడి ప్రభావాన్ని అర్థం చేసుకోడానికి, భూమిపై వాతావరణ పరిస్థితులను, రిస్క్‌లను అంచనా వేయడానికి కూడా ఈ మిషన్ ఎంతగానో సహకరిస్తుంది.

First Published:  31 Aug 2023 10:45 AM IST
Next Story