Telugu Global
Science and Technology

మార్కెట్‌లో కొత్త వేవ్.. LG స్ట్రెచబుల్ డిస్ప్లే ఆవిష్కరణ!

LG స్ట్రెచబుల్ డిస్ప్లేను LG ఎలక్ట్రానిక్స్ ఆవిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంప్రదాయ డిస్ప్లేలకంటే భిన్నంగా, ఈ డిస్ప్లేను మెలితిప్పడం లేదా సాగదీయడం సాధ్యమవుతుంది.

మార్కెట్‌లో కొత్త వేవ్.. LG స్ట్రెచబుల్ డిస్ప్లే ఆవిష్కరణ!
X

LG స్ట్రెచబుల్ డిస్ప్లేను LG ఎలక్ట్రానిక్స్ ఆవిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంప్రదాయ డిస్ప్లేలకంటే భిన్నంగా, ఈ డిస్ప్లేను మెలితిప్పడం లేదా సాగదీయడం సాధ్యమవుతుంది. 'స్ట్రెచబుల్ డిస్ప్లే' పేరుతో LG ఈ కొత్త స్క్రీన్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే డిస్ప్లే రంగంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేసిన LG, ఇప్పుడు మరో ముందడుగు వేసి ఈ ప్రత్యేక డిస్ప్లేను అందుబాటులోకి తెచ్చింది.

LG స్ట్రెచబుల్ డిస్ప్లే:

ప్రపంచ డిస్ప్లే టెక్నాలజీలో ముందంజలో ఉన్న LG, ఇప్పుడు ఒక కొత్త స్ట్రెచబుల్ డిస్ప్లేను ప్రకటించింది. ఈ స్క్రీన్‌ను ట్విస్ట్ చేయడం, ఫోల్డ్ చేయడం లేదా సాగదీయడం లాంటివి చేసిన కూడా అద్భుతంగా పని చేస్తుందని LG చెబుతుంది. ఆధునిక టెక్నాలజీ మరియు వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఈ డిస్ప్లే అనేక అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుందని LG పేర్కొంది.

ఈ కొత్త డిస్ప్లే ప్రత్యేకతల గురించి మాట్లాడితే, ఈ స్క్రీన్ 12 ఇంచెస్ పరిమాణంలో ఉంటే, దాన్ని 18 ఇంచెస్ వరకు సాగించవచ్చు. ఇది ఎంత సాగే లక్షణం కలిగిఉన్నా, పనితీరులో ఎలాంటి లోపం రాదని LG స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ డిస్ప్లేను మెలిపెట్టడం, వంచడం కూడా సాధ్యమని కంపెనీ తెలిపింది.

ఈ స్క్రీన్ 100 ppi హై రిజల్యూషన్ మరియు ఫుల్ RGB కలర్ సపోర్ట్‌తో వస్తుంది. ప్రత్యేకమైన సిలికాన్ మెటీరియల్, వైరింగ్ డిజైన్ వలన ఈ కొత్త రకం డిస్ప్లే రూపొందించబడింది. ఈ స్క్రీన్‌లో 40μm లైట్ ఇచ్చే మైక్రో LED లైట్స్ ఉన్నాయి, ఇవి 10,000 సార్లు వరకు స్ట్రెచ్ అవ్వగలవు అని LG పేర్కొంది. ఈ డిస్ప్లే ప్రత్యేక లక్షణాల వలన దుస్తుల తయారీ, ఫ్యాషన్ రంగాల్లో మార్పును తీసుకురావడానికి ఉపయోగపడుతుందని LG వెల్లడించింది. అదనంగా, ఆటోమోటివ్ ప్యానల్స్ లాంటి అనేక విభాగాల్లో దీన్ని ఉపయోగించవచ్చని కంపెనీ అభిప్రాయపడింది.

LG కొత్తగా ఆవిష్కరించిన ఈ స్ట్రెచబుల్ డిస్ప్లేలు త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

First Published:  13 Nov 2024 2:13 PM IST
Next Story