Telugu Global
NRI

ప్రజా భవన్ లో ప్రవాసీ ప్రజావాణి

ఈ నెల 27 శుక్రవారం బేగంపేటలోని జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ 10 గంటలకు ప్రారంభం

ప్రజా భవన్ లో ప్రవాసీ ప్రజావాణి
X

గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 16న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో... మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీపీసీసీ ఎన్నారై సెల్ నాయకులు, గల్ఫ్ జేఏసీ ప్రతినిధులు ఈనెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్ బేగంపేట లోని జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌ లో ప్రభుత్వం ప్రతి మంగళ, శుక్ర వారాలలో ప్రజావాణి నిర్వహిస్తున్నది. ఇందులో ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రజాభవన్‌లోనే గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం ప్రవాసీ ప్రజావాణి అనే ప్రత్యేక కౌంటర్ కు ఈనెల 27న ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు సూచించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆహ్వానిస్తూ టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ డాక్టర్‌ బీఎం వినోద్ కుమార్, ఐఎఫ్‌ఎస్‌ (రిటైర్డ్) ఒక ప్రకటన విడుదల చేశారు.

First Published:  24 Sept 2024 6:40 AM GMT
Next Story