Telugu Global
NEWS

మీడియా నాకు పెళ్లి చేయాలని చూస్తోంది.. విజయ్ అసహనం

విజయ్ దేవరకొండ - రష్మిక మొదటిసారి గీతగోవిందం సినిమా కోసం జోడీ కట్టారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ వెంటనే వీరిద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ మూవీలో నటించారు.

మీడియా నాకు పెళ్లి చేయాలని చూస్తోంది.. విజయ్ అసహనం
X

యంగ్ హీరో విజయ్ దేవరకొండ - హీరోయిన్ రష్మిక మందన్న త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని.. ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ కూడా జరగనుందని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు నిజం కాదని.. నమ్మవద్దని విజయ్ దేవరకొండ టీమ్ క్లారిటీ ఇచ్చినా ఈ ప్రచారం ఆగడం లేదు. తాజాగా తన పెళ్లి, ఎంగేజ్మెంట్‌పై హీరో విజయ్ దేవరకొండ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు.

విజయ్ దేవరకొండ ' లైఫ్ స్టైల్ ఆసియా ' అనే మ్యాగజైన్ కోసం తాజాగా ఫొటోషూట్ చేశాడు. ఆ తర్వాత ఆ మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎంగేజ్మెంట్ పై వస్తున్న న్యూస్ గురించి ప్రశ్నించగా.. విజయ్ దేవరకొండ స్పష్టత ఇచ్చాడు. ఫిబ్రవరిలో తనకు ఎలాంటి పెళ్లి, నిశ్చితార్థం జరగడంలేదని తేల్చిచెప్పాడు.

ప్రతి రెండేళ్లకోసారి తనకు కొన్ని మీడియా సంస్థలు పెళ్లి చేయాలని చూస్తున్నాయని అసహనం వ్యక్తం చేశాడు. ఆ మీడియా సంస్థలు నిత్యం తన చుట్టూ తిరుగుతూ తాను కనిపిస్తే చాలు పెళ్లి చేయాలని చూస్తున్నాయని అన్నాడు. ప్రతి ఏటా ఇలాంటి రూమర్లు వింటూనే ఉన్నానని విజయ్ చెప్పాడు.

విజయ్ దేవరకొండ - రష్మిక మొదటిసారి గీతగోవిందం సినిమా కోసం జోడీ కట్టారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ వెంటనే వీరిద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ మూవీలో నటించారు. వరుసగా రెండు సినిమాల్లో కలిసి నటించడం, పార్టీలు, విహారయాత్రలకు కలసి వెళ్లడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. తాము ఫ్రెండ్స్ మాత్రమేనని.. తమ మధ్య ఎటువంటి రిలేషన్ షిప్ లేదని.. ఈ ఇద్దరూ ప్రకటించినప్పటికీ ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు.

First Published:  20 Jan 2024 8:31 AM IST
Next Story