Telugu Global
NEWS

నాగ చైతన్య-శోభితలపై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్‌

గత కొన్ని నెలలుగా రిలేషన్‌లో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ.. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల గురువారం ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున సోషల్‌మీడియాలో పంచుకున్నారు.

నాగ చైతన్య-శోభితలపై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్‌
X

శుభం పలకరా పెళ్లికొడుకా అంటే.. పెళ్లి కూతురు ఎక్కడ చచ్చింది అన్నాడని ఓ పాత సామెత మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ సామెత ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామికి బాగా సరిపోతుంది. సెన్సెషన్‌ కోసం సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెప్తూ కాలం వెల్లదీస్తుంటారు వేణుస్వామి. గతంలో నాగచైతన్య, సమంత విడిపోతారంటూ వేణుస్వామి చెప్పిన మాటలు నిజమయ్యాయి. తాజాగా నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల విషయంలోనూ మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేశారు వేణుస్వామి.

గత కొన్ని నెలలుగా రిలేషన్‌లో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ.. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల గురువారం ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున సోషల్‌మీడియాలో పంచుకున్నారు. వారి వైవాహిక జీవితం సంతోషకరంగా ఉండాలని కోరుకున్నారు. వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు కూడా సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాన్స్, నెటిజన్లు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, ఈ నిశ్చితార్థం జరిగి 24 గంటలు కూడా గడవకముందే వేణుస్వామి సంచలన కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ఈ వీడియోలో నాగ చైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్ ముహూర్తంపై విశ్లేషణ చేశారు. వీరి వైవాహిక జాతకానికి సంబంధించి కళత్ర దోషం ఉందంటూ చెప్పుకొచ్చారు. దీని వల్ల భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతాయన్నారు. పనికిరాని ముహూర్తంలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని చెప్పుకొచ్చారు వేణుస్వామి.

నాగ చైతన్య, సమంత విషయంలో తాను చెప్పిందే నిజమైందని గుర్తు చేశారు వేణుస్వామి. శోభిత జాతకం ఏమాత్రం బాగాలేదని, 2027 వ‌ర‌కు బాగానే ఉన్నప్పటికీ మూడేళ్ల తర్వాత చైతూ, శోభిత మధ్య ఒక స్త్రీ కారణంగా సమస్యలు, గొడవలు వస్తాయన్నారు. ఇక ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ముహూర్తం, పుట్టిన నక్షత్రం వివరాలు చూస్తుంటే ఏమాత్రం కలిసి ఉండలేరని, కచ్చితంగా విడిపోతారని చెప్పారు వేణుస్వామి. ఐతే వారిద్దరూ కలిసి ఉండాలనే తాను కోరుకుంటున్నానని, తన జాతకం ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ఇటీవల ఏపీ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని చెప్పారు. అంతకుముందు కొన్ని విషయాల్లోనూ వేణు స్వామి అంచనా తిరగబడింది. దీంతో ఆయన సోషల్‌మీడియాలో తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. తాజాగా నాగ చైతన్య, శోభిత విషయంలో వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. శుభమా అంటూ ఓ జంట పెళ్లి చేసుకోబోతుంటే అశుభం పలకడం ఏంటని ఫైర్ అవుతున్నారు.

First Published:  9 Aug 2024 4:25 PM IST
Next Story