Telugu Global
NEWS

అమెరికా వీసా సేవ‌లు తాత్కాలికంగా నిలిపివేత‌

వీసాల‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ వ్య‌వ‌స్థ‌ను దేశ‌వ్యాప్తంగా ఆధునికీకరిస్తున్నట్లు అమెరిక‌న్ కాన్సులేట్ వెల్ల‌డించింది. వీసా ఫీజు చెల్లింపులు, ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లు తదితర సేవలు శనివారం నుంచి అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది.

అమెరికా వీసా సేవ‌లు తాత్కాలికంగా నిలిపివేత‌
X

అమెరికా వీసా సేవ‌ల‌ను దేశ‌వ్యాప్తంగా ఈనెల 28వ తేదీ వ‌ర‌కు నిలిపివేస్తున్న‌ట్టు హైద‌రాబాద్‌లోని అమెరిక‌న్ కాన్సులేట్ తెలిపింది. ఈ సేవలు అందించేందుకు ప్రస్తుతం వినియోగిస్తున్న వ్యవస్థను మరింత అధునాతనంగా మార్పు చేసేందుకు తాత్కాలికంగా సేవ‌లు నిలిపివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. బుధ‌వారం నుంచి ఈ సేవ‌లు నిలిచిపోగా, శుక్ర‌వారం వ‌ర‌కు కూడా అదే ప‌రిస్థితి కొన‌సాగ‌నుంది.

వీసాల‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ వ్య‌వ‌స్థ‌ను దేశ‌వ్యాప్తంగా ఆధునికీకరిస్తున్నట్లు అమెరిక‌న్ కాన్సులేట్ వెల్ల‌డించింది. వీసా ఫీజు చెల్లింపులు, ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లు తదితర సేవలు శనివారం నుంచి అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. కస్టమర్ సర్వీస్ ఈ-మెయిల్ ఐడీ కూడా మారుతుందని పేర్కొంది.

శనివారం నుంచి support- india@usvisascheduling.com ద్వారా సంప్రదించవచ్చని తెలిపింది. మార్పులకు సంబంధించిన మరింత సమాచారం కోసం USTravelDocs వెబ్‌సైట్‌ను చూడవచ్చని పేర్కొంది. శనివారంలోగా అత్యవసరంగా వీసాలు, ఇతర సేవలు కావాల్సినవారు Hydconschief@state.gov లేదా Hydcea@state.gov సంప్రదించవచ్చని అమెరికన్ కాన్సులేట్ ట్వీట్‌లో పేర్కొంది.

First Published:  27 July 2023 8:09 AM IST
Next Story