Telugu Global
NEWS

నెపోటిజంపై రానా, నాని ఆసక్తికర కామెంట్స్

సోనీ లివ్ ఓటీటీలో సింగర్ స్మిత హోస్ట్ గా నిజం అనే షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షో రెండో ఎపిసోడ్ లో హీరోలు రానా, నాని పాల్గొన్నారు.

నెపోటిజంపై రానా, నాని ఆసక్తికర కామెంట్స్
X

సినిమాలైనా, రాజకీయాలైనా ఇంకా ఏ రంగంలో అయినా నెపోటిజం (బంధుప్రీతి) ఉంటుంది. మిగతా రంగాల్లో నెపోటిజం ఉన్నా అంతగా కనిపించదు. కానీ, సినీ ఇండస్ట్రీలో మాత్రం అందరికీ కనబడుతుంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారి వారసులే హీరోలవుతుంటారని, నిర్మాతలు అవుతుంటారని విమర్శలు వస్తుంటాయి.ఈ నెపోటిజంపై తాజాగా యువ హీరోలు దగ్గుబాటి రానా, నాని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

సోనీ లివ్ ఓటీటీలో సింగర్ స్మిత హోస్ట్ గా నిజం అనే షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షో రెండో ఎపిసోడ్ లో హీరోలు రానా, నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానా నెపోటిజం గురించి మాట్లాడుతూ ఒక వ్యక్తి తన కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకు వెళ్ళలేకపోతే అది అతడి తప్పేనని అన్నారు. తన తాతయ్య రామానాయుడు ఉన్న ఆస్తిని అమ్మి సినీ రంగంలోకి వచ్చి 45 ఏళ్ల పాటు సినిమాలు చేశారన్నారు. ఆయన ఇద్దరు కుమారులు ఇండస్ట్రీలోకి వచ్చి ఆయన వారసత్వాన్ని కొనసాగించారని చెప్పారు. ఒకవేళ తాను ఆ లెగసీని ముందుకు తీసుకు వెళ్ళలేకపోతే అది తన తప్పే అవుతుందన్నారు.

వారసత్వం వల్ల వచ్చే బరువు, బాధ్యతలు అందరికీ తెలియవని రానా అన్నారు. నెపోటిజం అన్నది కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుందని టాలెంట్ లేకపోతే సినీ ఇండస్ట్రీలో నెట్టుకురావడం కుదరదని రానా తేల్చి చెప్పాడు.

నెపోటిజంపై మరో యంగ్ హీరో నాని మాట్లాడుతూ.. నెపోటిజాన్ని సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరు ఫాలో కావడం లేదని, సినిమాలు చూసే ప్రేక్షకులే దాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. తాను చేసిన మొదటి సినిమాని లక్ష మంది ప్రేక్షకులు మాత్రమే చూశారని, అదే చరణ్ చేసిన మొదటి సినిమాని కోటి మంది చూశారని చెప్పారు. మరి చూసిన ప్రేక్షకులే కదా.. నెపోటిజాన్ని ప్రోత్సహిస్తోందని నాని ప్రశ్నించాడు. ప్రేక్షకులకు ఏం కావాలో అది వాళ్లు అందిస్తున్నారని.. అందుకే వారికి ప్రోత్సాహం అందుతోందని నెపోటిజంపై నాని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

First Published:  24 Feb 2023 6:09 PM IST
Next Story