డిసెంబర్‌లో లాంచ్ అయ్యే ఫోన్లు ఇవే!
క్రిస్టమస్, న్యూ ఇయర్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నెలలో టాప్ బ్రాండ్స్ నుంచి మిడ్ రేంజ్, ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ లాంచ్ అవ్వబోతున్నాయి.
మొబైల్ ప్రియులు ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్న కొన్ని పాపులర్ మొబైల్ మోడల్స్ ఈ ఏడాది చివర్లో లాంచ్ అవ్వనున్నాయి. క్రిస్టమస్, న్యూ ఇయర్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నెలలో టాప్ బ్రాండ్స్ నుంచి మిడ్ రేంజ్, ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ లాంచ్ అవ్వబోతున్నాయి. మొబైల్స్ లిస్ట్‌తోపాటు వాటి ఫీచర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వన్‌ప్లస్ లవర్స్ ఎదురుచూస్తున్న బ్రాండ్ న్యూ ‘వన్‌ప్లస్ 12’ స్మార్ట్‌ఫోన్.. డిసెంబర్ 4న చైనాలో లాంచ్ అవ్వనుంది. ఆ తర్వాత ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. వన్‌ప్లస్ 12 ఫోన్.. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఇందులో 6.7 ఇంచెస్ 2కె రిజల్యూషన్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతోపాటు 50-ఎంపీ ప్రైమరీ కెమెరా, 5,400ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్
ఈ ఏడాది చివర్లో రెడ్‌మీ నుంచి నోట్ 13 ప్రో ప్లస్ ఫోన్ లాంచ్ అవ్వనుంది. ఇందులో ఏకంగా 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండనుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఇందులో 6.67 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు 5,000ఎంఏహెచ్ బ్యాటరీ. 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఐకూ 12
ఐకూ బ్రాండ్‌కు చెందిన ఫ్లాగ్ షిప్ మొబైల్ ‘ఐకూ12’.. ఈ నెలలో రిలీజ్ అవ్వనుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరాతో పాటు 6.7 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ.. 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
రియల్‌మీ జీటీ5 ప్రో
రియల్‌మీ నుంచి రాబోతున్న ఫ్లాగ్‌షిప్ మొబైల్ ‘రియల్‌మీ జిటీ5 ప్రో’.. డిసెంబర్ 7న చైనాలో లాంచ్ కానుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తోపాటు వైర్‌లెస్ ఛార్జింగ్, హై ఎండ్ కెమెరా,1 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉండబోతున్నాయి. ఈ ఫోన్ ఇండియాలో ఎప్పుడు లాంఛ్ అవుతుందో ఇంకా తెలియాల్సి ఉంది.
హానర్ 100
రీసెంట్‌గా చైనాలో లాంచ్ అయిన హానర్ 100 మొబైల్.. ఈ నెలలో గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ అవ్వనుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఇందులో 6.7 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 100వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
ఒప్పో రెనో 11 సిరీస్
ఒప్పో బ్రాండ్‌కు చెందిన రెనో 11 సిరీస్ ఫోన్‌లు ఈ నెలలో ఇండియాలో లాంచ్ అవ్వనున్నాయి. ఇవి మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్ పై పనిచేస్తాయి. వీటిలో 6.7 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు 4,800ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
♦