Telugu Global
NEWS

మండే వేసవిలో కూల్ కూల్ ఫేస్ ప్యాక్స్ ఇవి..

శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందాన్ని మెరుగుపరచడంలో కూడా సోంపు కీలక పాత్ర పోషిస్తుంది. రెండు టీ స్పూన్ల సోంపు గింజలను దంచి, అరకప్పు నీటిలో వేసి, మరిగించాలి.

మండే వేసవిలో కూల్ కూల్ ఫేస్ ప్యాక్స్ ఇవి..
X

వేసవిలో ఆరోగ్యంతో పాటు, చర్మ సంరక్షణ కూడా ఏంతో ముఖ్యం. ఎందుకంటే ఎండలోకి వెళ్ళినప్పుడు చర్మం బర్న్ అవుతుంది. చెమట కారణంగా చర్మ రంధ్రాలు మూసుకోవడం, చర్మ రంగు మారడం, వాపు వంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్యలను అధిగమిస్తూ అందంగా కనిపించాలంటే ఈ బ్యూటీ టిప్స్‌ ట్రై చేయండి.



పుచ్చకాయ ఫేస్ ప్యాక్..

పుచ్చకాయలో నీటి శాతం చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అందులోనూ ఇది వేసవిలో విరివిగా దొరుకుతుంది. పుచ్చకాయ, ద్రాక్ష కలిపి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. దీంట్లో నిమ్మరసం, కోడిగుడ్డు లోని తెల్లసొన కలిపి పేస్ట్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. వేసవిలో ఈ ఫ్రూట్‌ ప్యాక్‌ని తరచూ వేసుకోవడం వల్ల చర్మంలో జిడ్డు తగ్గి, కాంతివంతం అవుతుంది. ఇదంతా కుదరకపోతే 1/2 కప్పు పుచ్చకాయ గుజ్జు కు 1 టేబుల్ స్పూన్ పెరుగు కలపండి, దీనిని ముఖంపై రుద్ది చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.


ఆరెంజ్‌ ప్యాక్ ..

ఆరెంజ్‌ జ్యూస్ కి ఒక టీ స్పూన్‌ తేనె, టేబుల్‌ స్పూన్‌ ఓట్స్, రోజ్‌ వాటర్‌ కలిపి పేస్ట్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి, చల్లబడ్డాక ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకుంటే ముఖచర్మం సేదదీరుతుంది. ఆరెంజ్ కి బదులు టమోటో గుజ్జుతో కూడా ఇలా ట్రై చెయ్యచ్చు.


కలబంద ప్యాక్ ..

కలబంద రసం నాలుగు టేబుల్ స్పూన్లు, అందులోనే ఒక టేబుల్ స్పూన్ పెరుగు కలిపి, ముఖానికి మెడకు, చేతులకు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కలబంద వేసవిలో చర్మాన్ని చల్లగా ఉంచుతుంది. పెరుగు న్యాచురల్ బ్లీచింగ్ లక్షణాలను కలిగిఉంటుంది.



సోంపుగింజలతో..

శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందాన్ని మెరుగుపరచడంలో కూడా సోంపు కీలక పాత్ర పోషిస్తుంది. రెండు టీ స్పూన్ల సోంపు గింజలను దంచి, అరకప్పు నీటిలో వేసి, మరిగించాలి. చల్లారాక వడకట్టి, టీ స్పూన్‌ నిమ్మరసం వేసి కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఎండ నుంచి ఇంటికి వచ్చినప్పుడు దూదితో ఆ సోంపు నీటిని ముఖం, మెడ, చేతులకు రాసుకొని తరువాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ నీళ్లు స్వేదరంధ్రాలలోని మలినాలను తొలగించటం ద్వారా దురద, దద్దుర్లు, ట్యాన్‌ వంటి సమస్యలను తగ్గిస్తాయి.

First Published:  28 May 2024 9:37 PM IST
Next Story