కల్కి క్యామియోస్.. ఎవరెవరు ఉన్నారంటే..?
ముఖ్యంగా ప్రభాస్ భైవర పాత్రలో సినిమాకు ప్రధాన బలంగా నిలిచాడు. తనదైన యాక్టింగ్ తో పాటు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించాడు. అలాగే కథలో మరో కీలకమైన పాత్ర అశ్వద్ధామ గా అమితాబ్ నటన అద్భుతమనే చెప్పుకోవచ్చు.
సినిమా ప్రియుల నిరీక్షణకు తెరపడింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను హీరోగా పెట్టి నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ నేడు అట్టహాసంగా విడుదలైంది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ అనే తేడా లేకుండా థియేటర్స్ అన్నీ హౌస్ ఫుల్స్‌తో కళకళలాడుతున్నాయి.
మైథాలజీ మరియు సైన్స్ ఫిక్షన్ కాంబినేసన్ కు ఫాంటసీ మిక్స్ చేసి ఆడియన్స్ కు డైరెక్టర్ నాగ్ అశ్విన్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ను అందించారు. ప్రధాన పాత్రల్లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా ప్రభాస్ భైవర పాత్రలో సినిమాకు ప్రధాన బలంగా నిలిచాడు. తనదైన యాక్టింగ్ తో పాటు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించాడు. అలాగే కథలో మరో కీలకమైన పాత్ర అశ్వద్ధామ గా అమితాబ్ నటన అద్భుతమనే చెప్పుకోవచ్చు.
ఇకపోతే విడుదలకు ముందు నుంచి కల్కిలో క్యామియో రోల్స్ గట్టిగా ఉండనున్నాయని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ప్రచారమే నిజం అయింది. కల్కి మూవీలో టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, దర్శకధీరుడు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్, ఫరియా అబ్దుల్లా వంటి సినీ తారలు భాగం అయ్యారు. ప్రేక్షకులు ఊహించని టైమింగ్ లో కథకు తగ్గట్లుగా వీరందరినీ నాగ్ అశ్విన్ తెరపై చూపించి మెప్పించారు. ఇక కల్కిలో న్యాచురల్ స్టార్ నాని కూడా కనిపిస్తాడని వార్తలు వచ్చినా.. ఆయన మాత్రం సినిమాలో లేరు.