యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) – 2021 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది ఫలితాల్లో 685 మంది అభ్యర్థులు యూపీఎస్సీకి అర్హత సాధించారు. ఈ ఏడాది టాప్ 4లో నలుగురూ అమ్మాయిలే ఉండటం విశేషం. శృతి శర్మ జాతీయ స్థాయిలో తొలి ర్యాంక్ సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో అంకిత అగర్వాల్, గామినీ సింగ్లా, ఐశ్వర్యా వర్మ నిలిచారు. వీరి తర్వాత ఉత్కర్ష్ ద్వివేది (5), యక్ష్ చౌదరి (6), సామి ఏకే ఎస్ జైన్ (7), ఇషితా రతి (8), ప్రీతమ్ కుమార్ (9), హర్‌కీరత్ సింగ్ రాంధ్వా (10) టాప్ 10 ర్యాంకుల్లో ఉన్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన యశ్వంత్ కుమార్ రెడ్డి జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. పూసపాటి సాహిత్య 24వ ర్యాంకు, శృతి రాజ్యలక్ష్మి 25వ ర్యాంకు, రవికుమార్ 38వ ర్యాంకు, కొప్పిశెట్టి కిరణ్మయి 56వ ర్యాంకు, పాణిగ్రాహి కార్తీక్ (63), గడ్డం సుధీర్ కుమార్ (69), శైలజ (83), శివానందం (87), ఆకునూరి నరేష్ (117), అరుగుల స్నేహ (136), గడిగె వినయ్ కుమార్ (151), దివ్యాన్షు శుక్ల (153), కన్నెధార మనోజ్ కుమార్ (157), బొక్కా చైతన్య రెడ్డి (161), దొంతుల జీనత్ చంద్ర (201), ఆకవరం సాహస్య రెడ్డి (214) ర్యాంకులను జాతీయ స్థాయిలో సాధించారు. ఇక ఈ సారి యూపీఎస్సీకి ఎస్. కమలేశ్వర్ రావు (297), నల్లమోతు బాలకృష్ణ (420), ఉప్పులూరి చైతన్య (470) కూడా అర్హత సాధించారు.
నిరుడు యపీఎస్సీ నోటిఫికేషన్ వెలువడగా.. దీనికి సంబంధించి ఈ ఏడాది జనవరిలో రాత పరీక్ష నిర్వహించారు. ఇంటర్వూ, పర్సనాలిటీ టెస్టులను ఏప్రిల్, మే నెలల్లో తీసుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌తో పాటు కేంద్ర సర్వీసుల్లోని గ్రూప్ ఏ, గ్రూప్ బీ కోసం 685 మంది అభ్యర్థులను యూపీఎస్సీ సిఫార్సు చేసింది.