తమ విషయంలో జరుగుతున్న ప్రచారంపై మోహన్‌బాబు కుటుంబం స్పందించింది. ఆ వార్తలను ఖండించింది. అసత్య ప్రచారాలు చేయవద్దంటూ ఆ వార్తలు రాసిన మీడియాకు సూచించింది. అసలేం జరిగిందటే.. ఆస్తుల విషయంలో మోహన్‌బాబు, ఆయన తనయుడు మనోజ్ మధ్య గొడవ జరిగిందని, ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారంటూ ఆదివారం ఉదయం వార్తలు వచ్చాయి. మనోజ్ గాయాలతో వచ్చి మరీ కంప్లైంట్ చేశారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే మంచు ఫ్యామిలీ స్పందించింది.
Previous Articleడబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి భారత్
Next Article రెండో వన్డేలోనూ ఓడిన భారత మహిళా జట్టు
Keep Reading
Add A Comment