వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితంపై అందరి దృష్టి ఉన్నది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అక్కడ పోటీ చేస్తున్నారు. ఆదివారం ఆమె అక్కడ ప్రచారం నిర్వహించారు. శ్రీ తిరునెల్లి ఆలయంలో ప్రార్థనలు చేసిన అనంతరం రోడ్ షోలో పాల్గొన్నారు. యూడీఎఫ్ అభ్యర్థిగా వయనాడ్‌లో బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. వయనాడు ప్రజలు చూపెడుతున్న ప్రేమ, ఆప్యాయతలు తన హృదయాన్ని తాకాయని ..అది తనకు చాలన్నారు.
ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్, యూపీలోని రాయ్‌బరేలీ నుంచి గెలుపొందారు. అనంతరం రాహుల్ వయనాడ్‌ను వదులుకున్నారు. దీంతో అక్కడి నుంచి ప్రియాంక బరిలో దిగారు. ఈ నెల 13న వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక జరగనున్నది.