ధనుష్‌కు షాక్.. ఇకపై సినిమా చేయాలంటే కండీషన్స్ అప్లై
ఇకపై ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమాకు కాల్షీట్ ఇచ్చేలా హీరో, హీరోయిన్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇకపై ఏ హీరోయిన్, హీరో అడ్వాన్సులు తీసుకోకుండా నిషేధం విధించినట్లయింది.
హీరో, హీరోయిన్ల విషయంలో తమిళ నిర్మాతల మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. అడ్వాన్సులు తీసుకుని సినిమాలు పూర్తి చేయని నటీనటులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ప్రధానంగా హీరో ధనుష్ వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
తమిళ నిర్మాతల మండలి, తమిళనాడు థియేటర్ యజమానుల సంఘం, మల్టిప్లెక్స్ ఓనర్స్ అసిసోయేషన్, తమిళనాడు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ సభ్యులు చెన్నైలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. ఆగస్టు 15 తర్వాత సినిమా షూటింగ్స్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది. పెండింగ్‌లో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తర్వాతే కొత్త సినిమాలు మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక పెండింగ్‌లో ఉన్న మూవీల కోసం నటులు తీసుకున్న అడ్వాన్సులకు సంబంధించి ఓ రిపోర్టును కోరింది నిర్మాతల మండలి. ఇకపై ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమాకు కాల్షీట్ ఇచ్చేలా హీరో, హీరోయిన్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇకపై ఏ హీరోయిన్, హీరో అడ్వాన్సులు తీసుకోకుండా నిషేధం విధించినట్లయింది.
ప్రధానంగా రాయన్ మూవీ సక్సెస్‌తో జోష్‌లో ఉన్న ధనుష్‌కు షాకిచ్చింది నిర్మాతల మండలి. ధనుష్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడింది. అడ్వాన్స్ తీసుకుని షూటింగ్స్ పూర్తి చెయ్యడంలేదని ధనుష్‌పై నిర్మాతలు ఫిర్యాదు చేశారు. దీంతో ఇకపై నిర్మాతల మండలి పర్మిషన్ ఉంటేనే ధనుష్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.