విజయ్ వారసుడి ఎంట్రీ.. హీరోగా కాదు డైరెక్టర్‌గా
జాసన్ సంజయ్ ఇంటర్ వరకు చెన్నైలోనే చదివాడు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాడు. లండన్‌లో స్క్రీన్ రైటింగ్‌లో డిగ్రీ పాసయ్యాడు.
కోలీవుడ్ నెక్ట్స్ సూపర్ స్టార్ విజయ్ దళపతి వారసుడు సినీరంగ ప్రవేశం చేస్తున్నాడు. అయితే హీరోగా కాదట. డైరెక్టర్‌గా తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడు. సూపర్ హిట్ ప్రొడక్షన్ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ విషయాన్ని నిర్ధారించింది. తమ తదుపరి సినిమాతో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్‌ను డైరెక్టర్‌గా పరిచయం చేస్తున్నామని ప్రకటించింది.
విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్ కోర్సు
జాసన్ సంజయ్ ఇంటర్ వరకు చెన్నైలోనే చదివాడు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాడు. లండన్‌లో స్క్రీన్ రైటింగ్‌లో డిగ్రీ పాసయ్యాడు. కెనడాలోని టొరంటో ఫిల్మ్ స్కూల్‌లో ఫిల్మ్ ప్రొడక్షన్‌లో డిప్లమా చేశాడు. రెండు, మూడు షార్ట్ ఫిలింస్ కూడా తీశాడు. ఇప్పుడు డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నా స్క్రిప్ట్ నచ్చి, డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు సంజయ్ కృతజ్ఞతలు చెప్పాడు.
ఉప్పెన రీమేక్‌తో హీరోగా ఎంట్రీ అనుకున్నారు
వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా తెలుగులో సూపర్ హిట్ కొట్టిన ఉప్పెన సినిమాను కోలీవుడ్‌లో రీమేక్ చేస్తారని, అందులో జాసన్ సంజయ్ హీరోగా పరిచయం అవుతాడని మొన్నటి వరకు టాక్ నడిచింది. అయితే ఇప్పుడు హీరోగా కాకుండా డైరెక్టర్‌గా డెబ్యూ ఇస్తాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పలువురు సెలబ్రిటీలు అతనికి ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెబుతున్నారు.
*