Telugu Global
NEWS

జానీ అరెస్ట్ .. నాగబాబు వరుస ట్వీట్లు

టాలీవుడ్ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ అలియాస్‌ షేక్‌ జానీబాషాను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు.

జానీ అరెస్ట్ .. నాగబాబు వరుస ట్వీట్లు
X

టాలీవుడ్ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ అలియాస్‌ షేక్‌ జానీబాషాను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసుల టీమ్ గోవాలోని ఓ లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది. గోవా కోర్టులో జానీ మాస్టర్‌ను హాజరుపర్చిన పోలీసులు.. పీటీ వారెంట్‌ కింద హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. రేపు ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్‌ను హాజరుపరిచే అవకాశముంది.

గత నాలుగు రోజులుగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇష్యూ గురించి చర్చ నడుస్తోంది. ఓ మహిళా అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ ఇచ్చిన ఫిర్యాదు టాలీవుడ్ లో సంచలనంగా మారింది. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు .. అతనిపై పోక్సో యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేశారు. ఇక నాలుగు రోజులుగా కనిపించకుండా తిరుగుతున్న జానీ మాస్టర్ పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. ఇక ఇదే అంశంపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. బాధితురాలికి న్యాయం జరగాలని కోరుతున్నారు. ఇక తెలుగు ఫిల్మ్ చాంబర్ కూడా అంశంపై విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో తాజాగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. నేరం ఏదైనా కోర్టు నిర్ధారించేంత వరకు ఎవరూ నిందితులు కాదు. విన్న ప్రతిదీ నమ్మొద్దు, ప్రతి కథలోనూ 3 వెర్షన్లు ఉంటాయి అని లాయర్ విలియం గారో కొటేషన్ ట్వీట్ చేశారు”. దీంతో జానీ మాస్టర్ అంశంపైన పరోక్షంగా నాగబాబు ఈ ట్వీట్ వేసినట్టు చర్చ జరుగుతోంది.

తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ (21) ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. బాధితురాలు రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి నార్సింగికి బదిలీ చేశారు. అతడిపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. బాధిత యువతి కేసు పెట్టిన నాటి నుంచి 5 రోజులుగా జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. 4 ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు చేపట్టి జానీ మాస్టర్‌ను అరెస్ట్‌ చేశారు. ఇక జానీ మాస్టర్ ఏపీ ఎన్నికల్లో జనసేనలో కీలకంగా వ్యవహరించారు. మెగా ఫ్యామిలీతో కూడా జానీ మాస్టర్ కి సన్నిహిత సంబంధాలున్నాయి. లైంగిక వేధింపుల ఆరోపణల తర్వాత జానీ మాస్టర్ ని జనసేన పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.





First Published:  19 Sept 2024 4:30 PM IST
Next Story