Telugu Global
NEWS

ఇకపై అన్ని ఓటీటీలు ఒకేచోట చూడొచ్చు! ఎలాగంటే..

ఒక్కో ఓటీటీకి ఒక్కో సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవడం చాలామందికి ఆర్థికంగా భారమనిపించొచ్చు. అందుకే ప్రముఖ డీటీహెచ్‌ కంపెనీ టాటా ప్లే.. తాజాగా టాటా ప్లే బింజ్‌ పేరుతో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది.

ఇకపై అన్ని ఓటీటీలు ఒకేచోట చూడొచ్చు! ఎలాగంటే..
X

ప్రస్తుతం థియేటర్ల కంటే ఓటీటీల్లోనే ఎక్కువ కంటెంట్ దొరుకుతోంది. దాదాపు అన్ని ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సొంతంగా ఓటీటీ యాప్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. సినిమాలు, సీరియళ్లు, క్రికెట్ మ్యాచ్ లు అన్నీ ఓటీటీ యాప్స్ ద్వారానే చూస్తున్న రోజులివి. ఈ క్రమంలో అన్ని ఓటీటీలకు వేర్వేరు యాప్‌లు వాడకుండా అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తోంది 'టాటా ప్లే'.


మార్కెట్లో ఎన్నో రకాల ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఒక్కో ఓటీటీకి ఒక్కో సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవడం చాలామందికి ఆర్థికంగా భారమనిపించొచ్చు. అందుకే ప్రముఖ డీటీహెచ్‌ కంపెనీ టాటా ప్లే.. తాజాగా టాటా ప్లే బింజ్‌ పేరుతో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. దీని ద్వారా కేవలం ఒక్క సబ్‌స్క్రిప్షన్‌తో ఏకంగా 17 ఓటీటీలను వీక్షించొచ్చు. డీటీహెచ్‌తో పాటు డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, జీ5, సోనీ లివ్‌, వూట్‌ సెలెక్ట్‌, ఎంఎక్స్‌ ప్లేయర్‌, సన్‌ నెక్ట్స్‌, హంగామా ప్లే, ఎరోస్‌ నౌ, వూట్‌ కిడ్స్‌లతో పాటు మరికొన్ని ఓటీటీ సేవలను ఉచితంగా పొందొచ్చు. ఎంపిక చేసుకున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య ఆధారంగా సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ మారుతుంది. టాటా ప్లేలో రూ. 59, రూ. 99, రూ. 175, రూ. 299 .. ఇలా రకరకాల ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి ఆధారంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను ఎంచుకోవచ్చు.

First Published:  27 Sept 2022 1:00 PM IST
Next Story