Telugu Global
NEWS

స్త్రీ 2 బంపర్ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి

బాలీవుడ్ లో ప్రజెంట్ స్త్రీ2 హవా కొనసాగుతుంది. ఈ హారర్ కామెడీ మూవీ ఇప్పటివరకు రూ. 750 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

స్త్రీ 2 బంపర్ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి
X

బాలీవుడ్ లో ప్రజెంట్ స్త్రీ 2 హవా కొనసాగుతుంది. ఆగష్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హారర్ కామెడీ మూవీ ఇప్పటివరకు రూ. 750 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ ఏడాదిలో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన రెండో ఇండియన్ మూవీ స్త్రీ2. అంతేకాకుండా అత్యధిక వసూళ్లు రాబట్టిన 11వ భారతీయ సినిమా కూడా. స్త్రీ 2 ఊహించని సక్సెస్ అందుకోవడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సినీ ప్రియులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. స్త్రీ 2 సినిమా టికెట్లపై టీమ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితంగా పొందొచ్చని ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఈ ఆఫర్ వినియోగించుకోవాలంటే బుక్ మై షో యాప్ లో STREE 2 ప్రోమో కోడ్ ఉపయోగించాలని చెప్పింది. అయిఏ ఇక్కడ ఓ కండిషన్ కూడా పెట్టింది చిత్ర యూనిట్. సెప్టెంబర్ 13వ తేదీ మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. కాబట్టి థియేటర్లలో మూవీ చూడాలనుకునే వారు ఈ ఆఫర్ ను ఎంజాయ్ చేయోచ్చు. ఇక గతంలో మంచి విజయం అందుకున్న స్త్రీ కి సీక్వెల్ గా స్త్రీ 2 తెరకెక్కింది. రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ లీడ్ రోల్స్ లో అమర్ కౌశిక్ ఈ సినిమాను రూపొందించారు. తమన్నా, వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్ గెస్ట్ రోల్స్ లో కనిపించారు.

మరోవైపుస్త్రీ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం. బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం మేరకు సెప్టెంబర్ 27 నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. స్త్రీ 2 సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనూ రిలీజ్ కానున్నట్టు టాక్. థియేటర్లలో ప్రభంజనం సృష్టించిన ఈ మూవీ ఓటీటీ లో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తోంది చూడాలి.

First Published:  13 Sep 2024 10:30 AM GMT
Next Story