మందు, సిగరెట్ తాగుతున్నారా..?
మందు తాగడం, సిగరెట్ తాగడం, అధికంగా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవటం వంటివి శుక్రకణాల నాణ్యతను దెబ్బతీస్తాయని తెలిపారు.
BY Telugu Global17 April 2024 1:21 PM IST
X
Telugu Global Updated On: 17 April 2024 1:21 PM IST
అనారోగ్యకరమైన జీవన శైలి, దురలవాట్లు.. ఇవన్నీ మగవాళ్లలో శుక్రకణాల DNAను దెబ్బతీస్తాయని ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మందు తాగడం, సిగరెట్ తాగడం, అధికంగా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవటం వంటివి శుక్రకణాల నాణ్యతను దెబ్బతీస్తాయని తెలిపారు. వంధ్యత్వం, గర్భస్రావాలు, పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు.. శుక్ర కణాల్లో DNA దెబ్బతినటం వల్లే సంభవిస్తాయని వారు గుర్తుచేశారు.
గర్భధారణ, పిండం అభివృద్ధిలో తండ్రి పాత్రను విస్మరించలేమని ఎయిమ్స్ వెద్యులు చెప్పారు. మానసిక ఒత్తిడికి గురైనా.. ఆ ప్రభావం స్పెర్మ్‌పై ఉంటుందన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, యోగాతో దీని నుంచి బయటపడొచ్చన్నారు. యోగా మైటోకాండ్రియల్, న్యూక్లియర్ DNAల సమగ్రతను పెంచుతుందని వివరించారు.
Next Story