షోయబ్ లేకుండానే సానియా పుట్టినరోజు వేడుకలు - ఇన్‌ష్టాలో బర్త్‌డే విషెష్ చెప్పిన షోయబ్
సానియా వాళ్ల అమ్మతో కలిసి కేక్ కట్ చేస్తున్నప్పుడు, ఫరాఖాన్ పుట్టినరోజు పాట పాడింది, ఈ వేడుకలో సానియా స్నేహితురాలు అనన్య బిర్లా కూడా ఆమె పక్కన కనిపించారు.
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ల మధ్య వివాహ బంధం ముగిసిందనే పుకార్లు ఇటీవల బాగానే షికారు చేస్తున్నాయి. భర్త షోయబ్ మాలిక్ నుండి విడిపోయారనే పుకార్ల మధ్య, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన పుట్టినరోజును తన బెస్టి ఫరా ఖాన్‌తో జరుపుకుంది. ఫరాఖాన్ ప్రముఖ కొరియోగ్రాఫర్, చిత్రనిర్మాత కూడా. మంగళవారం రోజు సానియా పుట్టినరోజును తనతో జరుపుకున్న వీడియోను ఫరాఖాన్ కుందర్ ట్విట్టర్‌లో పెట్టారు.
సానియా వాళ్ల అమ్మతో కలిసి కేక్ కట్ చేస్తున్నప్పుడు, ఫరాఖాన్ పుట్టినరోజు పాట పాడింది, ఈ వేడుకలో సానియా స్నేహితురాలు అనన్య బిర్లా కూడా ఆమె పక్కన కనిపించారు. "హ్యాపీ బర్త్ డే నా డార్లింగ్ @మిర్జాసానియర్ ..ఈ సంవత్సరం నీ కోసం సంతోషం మరియు ప్రేమ మాత్రమే ♥️ .." అని ఆమె పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది.
వారి విడాకుల గురించి మీడియాలో రూమర్స్ వస్తూనే ఉన్నప్పటికీ, షోయబ్ మాలిక్ కూడా సానియాకు విష్ చేయడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో సానియాతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. " పుట్టినరోజు శుభాకాంక్షలు @mirzasaniar. మీరు చాలా ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటున్నారు! ఈ రోజును పూర్తిగా ఆనందించండి…" అంటూ కామెంట్ పెట్టాడు షోయబ్.
ఈ పోస్ట్‌పై సానియా ఇంకా స్పందించలేదు. సానియా - షోయబ్ త్వరలో తిరిగి కలుస్తారని పాకిస్తానీ నటుడు ఇమ్రాన్ అబ్బాస్ ఇన్‌స్టాలో కామెంట్ చేశారు. వారిద్దరూ స్నేహితులను కలవాలని ప్లాన్ చేస్తున్నారని వెల్లడించారు. "పుట్టినరోజు శుభాకాంక్షలు, నవంబర్ 22వ తేదీన కలుద్దాం." అని షోయబ్ ఇన్‌స్టాలో కామెంట్ చేశాడు ఇమ్రాన్.
షోయబ్ ఇన్‌స్టాలో ఈ జంట సంతోషంగా ఉన్న ఫొటో చూసి అభిమానులు సంతోషం ప్రకటించారు. "Hme apny relation s zaida ap dono k tension the" అని ఒకరు కామెంట్ చేయగా, "మీ ఇద్దర్నీ కలిసి చూడటం చాలా బాగుంది," "వాహ్ మలక్ సాబ్ యహాన్ పురా ముల్క్ పాగల్ హువా వా హై ఆప్ ఝప్పియన్ దాల్ రహయ్ హో ''. అంటూ మరొకరు కవిత్వం జోడించారు.
ఈ జంట విడాకుల కోసం వెళుతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. సానియా గతంలో దుబాయ్‌లోని పామ్ జుమేరాలోని షోయబ్‌తో కలిసి నివసించిన ఇంటిని విడిచిపెట్టి ఇటీవల దుబాయ్‌లోనే మరో కొత్త ఇంటికి మకాం మార్చారు. సానియా మీర్జా - షోయబ్ మాలిక్ పెళ్లికి ముందు నుంచే చాలా ఏళ్లు డేటింగ్‌లో ఉన్నారు. 2010 ఏప్రిల్లో వివాహం చేసుకున్నారు.