Telugu Global
NEWS

సమంతకు అనారోగ్య సమస్యలు నిజమేనా? మేనేజర్ క్లారిటీ..!

సమంత అనారోగ్యం పాలైందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని మేనేజర్ తేల్చారు. సమంత ప్రస్తుతం తెలుగులో యశోద, శాకుంతలం, ఖుషి, మరికొన్ని హిందీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది.

సమంతకు అనారోగ్య సమస్యలు నిజమేనా? మేనేజర్ క్లారిటీ..!
X

అగ్ర హీరోయిన్ సమంత అనారోగ్యం పాలయిందంటూ కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు సమంత బయట ఎక్కడా కనిపించకపోవడంతో ఆ వార్తలు నిజమేనని అభిమానులు భావిస్తున్నారు. తాజాగా ఈ వార్తలపై సమంత మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. సమంత అనారోగ్యం పాలైందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన తేల్చారు. సమంత ప్రస్తుతం తెలుగులో యశోద, శాకుంతలం, ఖుషి, మరికొన్ని హిందీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. అయితే కొంతకాలంగా ఆమె షూటింగులకు హాజరు కావడం లేదు. సినిమా ఈవెంట్స్ కానీ, బయట కానీ కొద్ది రోజులుగా కనిపించడం లేదు.

సోషల్ మీడియాలో సమంత చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన షూటింగ్‌కి సంబంధించిన విశేషాలు, రోజువారి అప్డేట్స్, లేటెస్ట్ ఫొటో షూట్లకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్‌లలో నిత్యం అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాంటిది సమంత నెల రోజులకు పైగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది.

కాగా సమంత ఒక అరుదైన చర్మ వ్యాధితో బాధ పడుతోందని, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ కోసం ఆమె త్వరలో అమెరికాకు వెళ్తున్నట్లు రెండు రోజులుగా వార్తలు జోరుగా వస్తున్నాయి. దీనిపై సమంత మేనేజర్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ..సమంత అనారోగ్యం పాలైందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. సమంత ఆరోగ్యంగానే ఉన్నారని, ఆమెకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు. అయితే సమంత ఎందుకు అమెరికా వెళ్తున్నారు..అనే విషయంపై మాత్రం ఆయన సమాధానం ఇవ్వలేదు.

First Published:  21 Sept 2022 7:35 PM IST
Next Story