IT Returns | ఇక నుంచి మొత్తం శాలరీపై ఐటీ పే చేయాల్సిందే.. నో హెచ్ఆర్ఏ క్లయిమ్.. తేల్చేసిన సీబీడీటీ!
కంపెనీ యాజమాన్యం ఇచ్చే కనీస వేతనం, వేతన భత్యం, ప్రత్యేక అలవెన్స్, ఈపీఎఫ్‌లో యాజమాన్యం భాగస్వామ్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితరాలు చెల్లిస్తే.. ఇంటి వసతి విలువ.. మొత్తం సదరు ఉద్యోగి లేదా కార్మికుడి వేతనంలో కలిపి గణిస్తారు.
IT Returns | వేతన జీవులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తుంటారు. వేతన జీవులు తామే దాఖలు చేసే ఐటీ రిటర్న్స్‌లో తమ వేతనంలో ఇంటి అద్దె భత్యం(హెచ్ఆర్ఏ) మినహాయింపు క్లయిమ్ ఫైల్ చేస్తారు. కానీ, ఈ విషయమై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కొత్త రూల్ తెచ్చింది. 2023 సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
కొన్ని కంపెనీలు, సంస్థల యాజమాన్యాలు తమ ఉద్యోగులు, సిబ్బందికి, కార్మికులకు అద్దె రహిత వసతి కల్పిస్తుంటాయి. అలా ఒక కంపెనీలో పని చేస్తూ.. ఆ సంస్థ ఆధీనంలోనే అద్దె రహిత ఇంటిలో నివసిస్తుంటారు ఉద్యోగులు. అలా యాజమాన్యాల ఆధీనంలో అద్దె రహిత ఇంట్లో జీవిస్తున్న ఉద్యోగుల వేతనం.. ఆదాయం పన్ను చట్టం-1960 శ్లాబ్ దాటితే తదనుగుణంగా ఆ వేతనం నుంచి టీడీఎస్ డిడక్ట్ చేస్తుంది ఆదాయం పన్ను విభాగం.
ఒక ఉద్యోగి లేదా కార్మికుడికి యాజమాన్యం.. ఇల్లు, ఫ్లాట్, ఫామ్ హౌస్, హోటల్, మోటల్, సర్వీస్ అపార్ట్‌మెంట్.. లేదా ఏ రూపంలో ఇంటి వసతి కల్పించినా.. సంబంధిత ఉద్యోగి లేదా కార్మికుడు ఇంటికి తీసుకెళ్లే వేతనం ఎక్కువగా ఉంటుంది. కనుక అలా ఎక్కువ తీసుకువెళ్లే వేతనం.. ఐటీ శ్లాబ్ దాటితే.. ఆదాయం పన్ను చెల్లించాల్సిందే. అయితే, అధికారిక విధులు నిర్వర్తించడానికి ఉద్యోగులకు వసతి కల్పించినట్లయితే పన్ను వర్తించదని ఆర్థిక రంగ నిపుణులు టాక్స్‌మన్ డాట్ కామ్‌తో దీపెన్ మిట్టల్ అనే చార్టర్డ్ అకౌంటెంట్ వ్యాఖ్యానించారు. హెచ్ఆర్ఏపై 2023 ఆగస్టు నెలాఖరు వరకూ పాత నిబంధనే వర్తిస్తుంది.
ఏడాదికి పైగా కంపెనీ యాజమాన్యం.. తన సిబ్బందికి ఇంటి వసతి కల్పిస్తే, ద్రవ్యోల్బణం ఆధారిత పరిమితి కూడా వర్తిస్తుంది. కంపెనీ యాజమాన్యం.. సిబ్బందికి వసతి కల్పించిన నగరం, జనాభా, సదరు ఇంట్లో సౌకర్యాలను బట్టి మదింపు చేస్తుంది. ఆయా సౌకర్యాలను బట్టి ఇంటి అద్దె ఖరారు చేస్తుంది యాజమాన్యం. తద్వారా తన ఉద్యోగి/ కార్మికుడి వేతనం.. దానిపై ఐటీ శ్లాబ్‌కు అనుగుణంగా టీడీఎస్ డిడక్ట్ చేస్తుంది.
కంపెనీ యాజమాన్యం ఇచ్చే కనీస వేతనం, వేతన భత్యం, ప్రత్యేక అలవెన్స్, ఈపీఎఫ్‌లో యాజమాన్యం భాగస్వామ్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితరాలు చెల్లిస్తే.. ఇంటి వసతి విలువ.. మొత్తం సదరు ఉద్యోగి లేదా కార్మికుడి వేతనంలో కలిపి గణిస్తారు.
యాజమాన్యం ఆధీనంలోని ఇంట్లో వసతులను బట్టి హెచ్ఆర్ఏ విలువ నిర్ణయిస్తారు. 2011 జన గణన ప్రకారం 40 లక్షలకు పైగా జనాభా గల నగరాల్లో 10 శాతం వేతనం హెచ్ఆర్ఏ కింద పరిగణిస్తారు. 40 లక్షల్లోపు జనాభా గల నగరాల్లో 7.5 శాతం, ఇతర ప్రాంతాల్లో ఐదు శాతం వేతనాన్ని హెచ్ఆర్ఏ లెక్కిస్తారు.
కొన్ని సంస్థలు హోటల్‌లో వసతి కల్పిస్తాయి. దీనికి సంబంధిత ఉద్యోగి వేతనంలో 24 శాతం లేదా వాస్తవ చార్జీల ఆధారంగా ఇంటి వసతి విలువ లెక్కిస్తారు. అద్దె ఇల్లు లేదా లీజ్‌కిచ్చిన ఇంటిలో వసతుల ఆధారంగానూ అద్దె విలువ నిర్ణయిస్తారు. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ వంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉంటే ప్రతియేటా 10 శాతం వసతి చార్జీ కింద మినహాయిస్తారు. ఇంటి నిజ విలువ ఆధారంగా ప్రభుత్వోద్యోగుల ఇళ్ల వసతిని లెక్కిస్తారు కానీ, ప్రభుత్వోద్యోగుల విషయమై నిబంధనల్లో ఎటువంటి మార్పులు ఉండబోవని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
♦