Telugu Global
NEWS

Jio BlackRock | మ్యూచువ‌ల్ ఫండ్స్‌పై జియో ఫైనాన్సియ‌ల్ గురి.. అందుకేం చేసిందంటే..?!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత పెద్ద అసెట్ మెనేజ్మ్ంట్ కంపెనీల్లో (మ్యూచువ‌ల్ ఫండ్ మార్కెట్‌) ఒక‌టి, అతి పెద్ద‌దైన బ్లాక్ రాక్‌, జియో ఫైనాన్సియ‌ల్ మ‌ధ్య భాగ‌స్వామ్యం ప‌ట్ల ఆస‌క్తి రేకెత్తిస్తుంద‌ని జియో ఫైనాన్సియ‌ల్ ప్రెసిడెంట్ కం సీఈఓ హితేశ్ సెథియా పేర్కొన్నారు.

Jio BlackRock | మ్యూచువ‌ల్ ఫండ్స్‌పై జియో ఫైనాన్సియ‌ల్ గురి.. అందుకేం చేసిందంటే..?!
X

రిల‌య‌న్స్ (Reliance), జియో (Jio) క‌లిస్తే ఒక సంచ‌ల‌నం. రిల‌య‌న్స్ జియో బ్రాండ్ అంటే ప్ర‌తి ఒక్క‌రూ.. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కూ, సాధార‌ణ వేత‌న జీవుల నుంచి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ల వ‌ర‌కు ఎంతో క్రేజ్‌. ప్ర‌తి ఒక్క‌రికీ చేరువ కావ‌డానికి రిల‌య‌న్స్ అనునిత్యం ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేస్తూ ఉంటుంది. అదే క్ర‌మంలో రిల‌య‌న్స్ (Reliance) నుంచి విడివ‌డిన జియో ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ (JFSL) వ‌డివ‌డిగా దేశ ఆర్థిక రంగంలో దూసుకెళ్లేందుకు అడుగేస్తుంది. ప్ర‌పంచంలోకెల్లా అతిపెద్ద ఫండ్ మేనేజ‌ర్ `బ్లాక్ రాక్ (BlackRock)`తో జ‌త క‌ట్టింది. ఇదిలా ఉంటే, భార‌త్ స్టాక్ మార్కెట్ల‌లో లిస్టింగ్ కావ‌డానికి జియో ఫైనాన్సియ‌ల్ క‌స‌ర‌త్తు చేస్తోంది. త‌ద్వారా దేశీయ మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో ఎంట్రీకి త‌హ‌త‌హలాడుతోంది.

ఇందుకోసం జాయింట్ వెంచ‌ర్ ఏర్పాటు చేశాయి జియో ఫైనాన్సియ‌ల్, బ్యాక్ రాక్‌.. `జియో బ్లాక్ రాక్ (Jio BlackRock)` అని పేరు పెట్టాయి. రెండు సంస్థ‌లు ప్రారంభ పెట్టుబ‌డిగా 150 మిలియ‌న్ డాల‌ర్లు (భార‌త్ క‌రెన్సీలో సుమారు రూ.1,230 కోట్ల పెట్టుబ‌డుల చొప్పున‌) పెట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు సంయుక్త ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. `జియో బ్లాక్ రాక్ (Jio BlackRock)`లో రెండు సంస్థ‌ల‌కు స‌మాన వాటా ఉంటుంది.

`నియంత్ర‌ణ సంస్థ‌ల, ప్ర‌భుత్వ ఆర్థిక సంస్థ‌ల ఆమోదం త‌ర్వాత జాయింట్ వెంచ‌ర్ కార్య‌క‌లాపాలు ప్రారంభిస్తుంది. జియో ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ ప‌రిజ్ఞానం-వ‌న‌రులు.. బ్లాక్ రాక్ ఇన్వెస్ట్‌మెంట్ అనుభ‌వం క‌ల‌గ‌లిపి భార‌త్‌లోని ల‌క్ష‌ల మంది ఇన్వెస్ట‌ర్లకు సృజాత్మ‌క పెట్టుబ‌డుల సొల్యూష‌న్స్ అందుబాటులోకి తేవ‌డానికి కృషి చేస్తాం. డిజిట‌ల్ స‌ర్వీసుల ద్వారా భార‌త్ ఇన్వెస్ట‌ర్లంద‌రికీ అందుబాటులోకి తేవ‌డంతోపాటు భార‌త్ అసెట్ మేనేజ్మెంట్ (మ్యూచువ‌ల్ ఫండ్‌) ప‌రిశ్ర‌మ‌లో ప‌రివ‌ర్త‌న తేవ‌డ‌మే ల‌క్ష్యంగా మా భాగ‌స్వామ్యం కృషి చేస్తుంది` అని జియో బ్లాక్ రాక్ సంయుక్త ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత పెద్ద అసెట్ మెనేజ్మ్ంట్ కంపెనీల్లో (మ్యూచువ‌ల్ ఫండ్ మార్కెట్‌) ఒక‌టి, అతి పెద్ద‌దైన బ్లాక్ రాక్‌, జియో ఫైనాన్సియ‌ల్ మ‌ధ్య భాగ‌స్వామ్యం ప‌ట్ల ఆస‌క్తి రేకెత్తిస్తుంద‌ని జియో ఫైనాన్సియ‌ల్ ప్రెసిడెంట్ కం సీఈఓ హితేశ్ సెథియా పేర్కొన్నారు. అమెరికా ఎస్ఈసీ తెలిపిన గ‌ణాంకాల ప్ర‌కారం గ‌త డిసెంబ‌ర్ నాటికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 8.6 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ 3.7 ల‌క్ష‌ల డాల‌ర్ల‌తో పోలిస్తే బ్లాక్ రాక్ విలువ రెండింత‌ల‌కు పైచిలుకే.

2008లో ప్ర‌పంచ ఆర్థిక మాంద్యం త‌ర్వాత భార‌త్‌కు చెందిన డీఎస్పీ గ్రూప్ మ్యూచువ‌ల్ ఫండ్ బిజిసెస్‌లో మెరైల్ లించ్ స్థానే బ్లాక్ రాక్ భాగ‌స్వామి అయ్యింది. కానీ, 2018 మ‌ధ్య‌లో డీఎస్పీ మ్యూచువ‌ల్ ఫండ్ బిజినెస్‌తో బ్లాక్ రాక్ విడిపోయింది. గ‌త‌వారం రిల‌య‌న్స్ నుంచి విడివ‌డిన రిల‌య‌న్స్ స్ట్రాట‌ర్జిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ సంస్థ‌కు జియో ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ లిమిటెడ్ అని పేరు పెట్టారు. అటుపై బ్లాక్ రాక్‌తో జియో ఫైనాన్సియ‌ల్ భాగ‌స్వామ్య ఒప్పందం కుదుర్చుకోవ‌డం కీల‌కం కానున్న‌ది. బ్లాక్ రాక్ ఆసియా ఏపీఏసీ, ఇండియా చైర్మ‌న్ రాచెల్ లార్డ్ స్పందిస్తూ గ్లోబ‌ల్ అసెట్ మేనేజ్మెంట్ రంగంలో త‌మ జాయింట్ వెంచ‌ర్‌కు అపార‌మైన అవ‌కాశాలు ఉన్నాయ‌న్నారు. ఈక్విటీ, డెట్‌, ఈటీఎఫ్ స్కీమ్స్‌, ఏఎంఎఫ్ఐ డేటా ప్ర‌కారం గ‌త జూన్ నాటికి భార‌త మ్యూచువ‌ల్ ఫండ్ ప‌రిశ్ర‌మ‌లో సుమారు రూ.45 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు ఉన్నాయ‌ని తెలుస్తున్న‌ది.

First Published:  27 July 2023 2:29 PM IST
Next Story