Telugu Global
NEWS

క‌ల్కితో ప్ర‌భాస్‌కు కొత్త పేరు

క‌ల్కితో ప్ర‌భాస్ పేరులో మార్పు వ‌చ్చింది. సినిమాను చూడాల‌నే ఆత్రుత‌లో అభిమానులు కూడా ఈ విష‌యాన్ని గ్ర‌హించ‌లేక‌పోయారు.

క‌ల్కితో ప్ర‌భాస్‌కు కొత్త పేరు
X

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ తాజాగా క‌ల్కి 2898 ఏడీ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. పురాణాలను భవిష్యత్తుకు ముడిపెడుతూ హై ఓల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్‌గా నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఈ విజువ‌ల్ వండ‌ర్ గురువారం విడుద‌లై సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, దీపికా ప‌దుకొనే, క‌మ‌ల్ హాస‌న్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు.

భైర‌వ పాత్ర‌లో ప్ర‌భాస్ త‌న‌దైన కామెడీ టైమింగ్ మ‌రియు యాక్ష‌న్ తో చెల‌రేగిపోయాడు. అలాగే మ‌హాభార‌తం ట్రాక్ బాగా హైలైట్ అయింది. యూనిక్ స్టోరీ, బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్, విజువ‌ల్స్‌ సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లడంతో ఆడియన్స్ క‌ల్కి ట్రాన్స్ నుంచి బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నారు. ఇదిలా ఉంటే.. క‌ల్కితో ప్ర‌భాస్ పేరులో మార్పు వ‌చ్చింది. సినిమాను చూడాల‌నే ఆత్రుత‌లో అభిమానులు కూడా ఈ విష‌యాన్ని గ్ర‌హించ‌లేక‌పోయారు.

గ‌తంలో ప్ర‌భాస్ సినిమాల టైటిల్ కార్డ్స్ లో ఆయ‌న పేరుకు ముందు యంగ్ రెబ‌ల్ స్టార్ అని ప‌డేది. కానీ క‌ల్కి మూవీ టైటిల్ కార్డ్స్ లో మాత్రం రెబ‌ల్ స్టార్ కు బ‌దులుగా శ్రీ ప్ర‌భాస్ అని వేశారు. దీంతో ప్ర‌భాస్ న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం పేరు మార్చుకున్నాడంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి నిజంగా ఆయ‌న త‌న పేరును మార్చుకున్నాడా..? లేక క‌ల్కి టీమ్ గౌర‌వ సూచ‌కంగా శ్రీ ప్ర‌భాస్ అని వేశారా..? అన్న‌ది తెలియాలంటే మ‌రో మూవీ విడుద‌ల అయ్యే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

First Published:  28 Jun 2024 5:38 AM GMT
Next Story