త్వరలో ఆకర్షణీయ ఫీచర్లతో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ రియల్‌మీ11.. స్పెసిఫికేషన్స్ ఇలా..!
రియల్‌మీ 11 తోపాటు రియల్‌మీ 11 ప్రో, రియల్‌మీ 11 ప్రో + 5జీ ఫోన్లు కూడా 31న మార్కెట్లోకి వచ్చేస్తాయి. గత మే నెలలో చైనా మార్కెట్‌లో తొలుత ఈ ఫోన్ ఆవిష్కరించారు.
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ తన రియల్‌మీ 11 ఫోన్‌ను ఈనెల 31న గ్లోబల్ మార్కెట్‌లో ఆవిష్కరించనుంది. ఈ విషయమై రియల్‌మీ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ ప్రకటన చేసింది. భారత్ మార్కెట్‌లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతి మాత్రం వెల్లడించలేదు. సర్క్యులర్ మాడ్యూల్ హౌసింగ్ రేర్ కెమెరా సెటప్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్ కలిగి ఉంటుంది. రియల్‌మీ 10 మోడల్‌కు కొనసాగింపుగా వస్తున్న రియల్‌మీ 11 ఫోన్ మీడియా టెక్ హెలియో జీ99 ఎస్వోసీ చిప్‌సెట్‌తో వస్తున్నది. రియల్‌మీ 11 తోపాటు రియల్‌మీ 11 ప్రో, రియల్‌మీ 11 ప్రో + 5జీ ఫోన్లు కూడా 31న మార్కెట్లోకి వచ్చేస్తాయి. గత మే నెలలో చైనా మార్కెట్‌లో తొలుత ఈ ఫోన్ ఆవిష్కరించారు.
గ్లోబల్ మార్కెట్‌లో తొలుత వియత్నాంలో ఆవిష్కరించనున్న రియల్‌మీ 11 సిరీస్ ఫోన్ల డిజైన్ కలర్ ఆప్షన్లను బయట పెట్టింది. గోల్డెన్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. రియల్‌మీ 11 ఫోన్ 6.4-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే విత్ 90హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 8 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా అందుబాటులో ఉంటుంది.
100-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్‌తోపాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ కెమెరా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 67 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్‌తో వస్తుంది.
రియల్‌మీ 10 4జీ ఫోన్ 4జీబీ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ.13,999, 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ రూ.16,999లకు లభిస్తుంది. రియల్‌మీ 11 5జీ ఫోన్ రూ.20 వేల వరకు ఉండొచ్చు. ఇదే సిరీస్‌లో రియల్‌మీ 11 ప్రో ఫోన్ రూ.23,999, రియల్‌మీ 11 ప్రో ప్లస్ ఫోన్ రూ.27,999 పలుకుతుందని తెలుస్తున్నది.