Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Saturday, September 13
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Cinema & Entertainment

    Ram Setu Movie Review: రామ్ సేతు- హిందీ రివ్యూ {2.25/5}

    By Telugu GlobalOctober 25, 2022Updated:March 30, 20254 Mins Read
    Ram Setu Movie Review: రామ్ సేతు- హిందీ రివ్యూ {2.25/5}
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    చిత్రం : రామ్ సేతు

    రచన- దర్శకత్వం : అభిషేక్ శర్మ

    తారాగణం : అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , నుస్రత్ భరుచా, సత్యదేవ్, నాజర్ తదితరులు

    సంగీతం : డానియల్ బి. జార్జ్, ఛాయాగ్రహణం : అసీమ్ మిశ్రా

    బ్యానర్స్ : కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, మజాన్ ప్రైమ్, అబడాంటియాఎంటర్టయిన్మెంట్, లైకా ప్రొడక్షన్స్

    నిర్మాతలు : అరుణా భాటియా విక్రమ్ మల్హోత్రా

    విడుదల : అక్టోబర్ 25, 2022

    రేటింగ్ : 2.25/5

    వరుస ఫ్లాపులెదుర్కొంటున్న అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ తో విజయాలకి వారధి వేసుకుందామని వచ్చాడు. భక్తి- యాక్షన్ సినిమాల సీజన్ నడుస్తోంది కాబట్టి ప్రేక్షకులు కూడా దీన్ని చూసి తరిద్దామని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కోవిడ్ కి ముందు ప్రారంభమై ఈ దీపావళికి విడుదలవుతున్న దీని కోసం చాలా కష్టపడ్డాడు అక్షయ్ కుమార్, దర్శకుడు అభిషేక్ శర్మ మీద విశ్వాసంతో. అభిషేక్ శర్మ కిది రెండో స్టార్ సినిమా. ఇవి తప్పిస్తే గతంలో తీసిన ఐదు సినిమాలూ చిన్న సినిమాలు. 2018 లో జాన్ అబ్రహాంతో ‘పరమాణు- ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్’ అని భారత దేశం జరిపిన అణుపరీక్ష మీద తీశాడు. ఇది ఫర్వాలేదన్పించుకుంది. ఇప్పుడు రామాయణంలోని రామసేతు మీద భక్తి- యాక్షన్ థ్రిల్లర్ తీశాడు. మరి ఈ ప్రయత్నమెలా వుంది? ఇందులో భక్తిగానీ, యాక్షన్ గానీ ఏమైనా వున్నాయా, ఇంకేమైనా వుందా? ఇది తెలుసుకోవడానికి రామేశ్వరం వెళ్దాం…

    కథ

    2007 లో నాస్తికుడైన డా. ఆర్యన్ కులశ్రేష్ఠ (అక్షయ్ కుమార్) పాకిస్థానీ బృందంతో ఆఫ్ఘనిస్తాన్‌లోని బామియాన్ కి వెళ్తాడు. అక్కడ ఓ భారతీయ రాజుకి చెందిన పురాతన నిధిని తవ్వుతున్నప్పుడు తాలిబన్లు దాడి చేస్తారు. ఆర్యన్ ఆ నిధిని చేజిక్కించుకుని తప్పించుకుంటాడు. ఇటు దేశంలో పుష్పక్ షిప్పింగ్ కంపెనీ యజమాని ఇంద్రకాంత్ (నాజర్) తన సేతుసముద్రం ప్రాజెక్టులో భాగంగా రామసేతుని కూల్చివేయాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తాడు. దీని వల్ల ఇంధనం ఆదా అవుతుందని, భారత్-శ్రీలంక మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందనీ అభిప్రాయపడతాడు.

    ఇది దేశంలో తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తుంది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవుతుంది. ఇంద్రకాంత్‌తో చేతులు కలిపిన ప్రభుత్వం, ఆర్కియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సహాయం తీసుకుంటుంది. ఇప్పటికి ఆర్యన్ ఏఎస్ఐ జాయింట్ డైరెక్టర్ జనరల్‌గా పదోన్నతి పొంది వుంటాడు. ఇతడి లాంటి నాస్తికుడే తమకు సహాయం చేయగలడని ప్రభుత్వం భావిస్తుంది. రామసేతు సహజసిద్ధమైన కట్టడమని, మానవ నిర్మితం కాదని పేర్కొంటూ నివేదికని సమర్పించాల్సిందిగా కోరుతుంది. అప్పుడు ఆర్యన్ సమర్పించిన నివేదిక రామాయణంపై కూడా ప్రశ్న లేవనెత్తుతుంది. ఇది పెను వివాదానికి దారి తీస్తుంది. ఇంద్రకాంత్ కూడా ఆర్యన్ తో జతకట్టి రామసేతువు మానవ నిర్మితం కాదని ప్రపంచానికి నిరూపించమని కోరతాడు.

    ఆర్యన్ రామేశ్వరం చేరుకుంటాడు. ప్రాజెక్ట్ మేనేజర్ బాలి (ప్రవేశ్ రాణా), పర్యావరణవేత్త డాక్టర్ సాండ్రా రెబెల్లో (జాక్వెలిన్ ఫెర్నాండెజ్) ఆర్యన్‌ మిషన్‌లో సాయం చేయడానికి వస్తారు. వీళ్ళ పరిశోధనల్లో రాముడు 7000 సంవత్సరాల క్రితం జన్మించాడని, రామసేతు రాముడి పుట్టుక కంటే ముందే వుంధనీ పేర్కొంటారు. ఇక దీని పర్యవసానాలు ఎలా ఎదుర్కొన్నాడన్నది, ఫలితంగా నాస్తికుడైన తను రామ సేతుని నిజంగా రాముడే వానర సైన్యంతో నిర్మించినట్టు నమ్మే ఆస్తికుడుగా ఎలా మారాడన్నది మిగతా కథ.

    ఎలావుంది కథ

    ఒక నాస్తికుడైన ఆర్కియాలజిస్టు దేవుడ్ని నమ్మే భక్తుడిగా మారే ప్రయాణమే ఈ కథ. బాబ్రీ మసీదు కింద రామాలయం లేదనడం ఎలాంటిదో, రామేశ్వరంలో రామసేతు లేదనడం అలాటిది. సాక్షాత్తూ నాసా అలాటిదేమీ లేదని సాక్ష్యాలు చూపించినా మత విశ్వాసం ముందు అది దిగదుడుపే. కాబట్టి నాస్తికుడైన ఆర్యన్ ఆస్తికుడుగా మారకపోతే ఈ సినిమా వుండదు, బాయ్ కాట్ అవుతుంది.

    అయితే ఈ సినిమా తీసిన దర్శకుడి దార్శనికత ఎలాంటిదంటే అతనే సెంటిమెంట్లకి పూర్తిగా కట్టుబడడు. ఆటో కాలు ఇటో కాలు వేసి కన్ఫ్యూజ్ చేస్తాడు. రామేసేతు కథ కోసం రామేశ్వరంలో ఆకాలు పెట్టకుండా, డామన్ డయ్యూలో పాదం మోపి ఇదే రామేశ్వరం అనుకోమంటే ఎలా? బడ్జెట్ సరిపోకపోతే ఈ సినిమా ఎవరు తీయమన్నారు. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్టు, డామన్ వెళ్ళినా అట్టర్ ఫ్లాప్ తప్పలేదు.

    రామేశ్వరంని ఎవాయిడ్ చేసినట్టు, రామసేతుతో సంబంధమున్న శ్రీలంకని కూడా ఎవాయిడ్ చేశాడు. శ్రీలంక బదులు గోవా చేరింది. శ్రీలంకలో స్థిరపడ్డ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సాండ్రా రెబెల్లో పాత్ర, తను గోవాకు చెందానని చెప్పుకుంటుంది. ఇలాటివి చాలా వున్నాయి. అసలు రామసేతు మీద సినిమా తీస్తూ మొదటి అరగంట వేరే సినిమా చూపించే ‘భక్తి’ కూడా వుంది. ఈ అరగంట సేపు అక్షయ్ కుమార్ ఆర్కియాలజిస్టు పాత్ర ఇండియానా జోన్స్ లాగా చేసే వేరే సాహసకృత్యాలే వున్నాయి అసలు కథతో సంబంధం లేకుండా.

    చివరికి అక్షయ్ కుమార్ నాస్తిక పాత్ర రామభక్తుడయ్యే ఉద్వేగభరిత సన్నివేశం తప్ప మరేమీ లేదు ఈ సినిమాలో. అయితే రామభక్తుడిగా మారడానికి దారితీసిన పరిస్థితుల కల్పన మాత్రం వుండదు. ఆకస్మాత్తుగా ఈ దృశ్యం వస్తుంది ముగింపులో. కృష్ణం రాజు నటించిన భక్త ‘కన్నప్ప’ లో నాస్తికుడైన తిన్నడు శివ భక్తుడయ్యే కన్నప్పగా మారే క్రమానికో కథ వుంటుంది. ‘రామ్ సేతు’ దర్శకుడు కనీసం భక్తి సినిమాలైనా ఎలావుంటాయో చూడకుండా, తనకు తెలిసిన గ్రాఫిక్స్ తో యాక్షన్ దృశ్యాలు తీసేసినట్టుంది. ఇవికూడా నాసి రకంగా హాస్యాస్పద్సంగా వున్నాయి. సముద్రం, డైవింగ్ దళాలు, రామసేతు సెట్ కూడా ఆకర్షణీయంగా లేవు. రామసేతు బయటపడుతోందంటే ప్రేక్షకుల వెంట్రుకలు నిక్కబొడుచుకుని కేకలు వేసే డ్రామా వుండాలి. ఇలాటి కమర్షియల్ చిత్రీకరణ కూడా లేదు. స్పిరిచ్యువల్ జర్నీ అన్నాక ప్రేక్షకుల్ని బలంగా ఆ లోకంలోకి లాక్కెళ్ళే దర్శకత్వ ప్రతిభ లోపించింది.

    నటనలు- సాంకేతికాలు

    అక్షయ్ కుమార్ పాత్ర బలహీనతలు నటనలో కనపడతాయి. పాత్ర బలహీనం, కథ కూడా బలహీనం కావడంతో తన హీమాన్ యాక్షన్ దృశ్యాలు బోరు కొట్టే స్థాయిలో వున్నాయి. మాస్ ప్రేక్షకులు కూడా ఈలలు వేయలేరు. స్పిరిచ్యువల్ షేడ్స్ రివీలయ్యే సస్పెన్సు తో కూడిన పాత్ర చిత్రణ అయివుంటే – అక్షయ్ అలా రూపొందించుకుని వుంటే ఈ సినిమా బెటర్ గా వుండేది. స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన ఆర్కియాలజిస్టు ఇండియానా జోన్స్ సినిమాలు ప్రసిద్ధి చెందిన స్పిరిచ్యువల్ థ్రిల్లర్సే కదా?

    అక్షయ్ కి తోడుండే యాక్షన్ పాత్రలో తెలుగు నటుడు, ‘గాడ్ ఫాదర్’ ఫేమ్ సత్యదేవ్ కాస్త కామెడీ చేస్తూ ఆకట్టుకుంటాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నూస్రత్ భరూచాలు సహాయ పాత్రలుగా మిగిలిపోయారు. విలన్ గా మాత్రం నాజర్ ఒక ఊపు ఊపాడు. చాలా విషాదకరమేమిటంటే, ఛాయాగ్రాకుడు అసీమ్ మిశ్రా టాలెంట్ అంతా బూడిదలో పోసిన పన్నీరవడం. డానియల్ జార్జ్ నేపథ్య సంగీతంతో మాత్రం యాక్షన్ సీన్స్ కి ప్రాణం పోసే ప్రయత్నం చేశాడు. మొత్తానికి ఈ సినిమా ఎలా వుందో తెలుసుకోవడానికి రామేశ్వరం వెళ్దామని పైన చెప్పుకున్నాం- వెళ్తే ఏమవుతుందో ఇంకా ధైర్యముంటే వెళ్ళి చూడొచ్చు.

    Ram Setu Ram Setu Movie Review
    Previous Articleరిషి సునాక్ విజయం.. భారత్ కి ఓ పాఠం
    Next Article Forget about Munugode, BJP Top brass in a fear of branding as Anti-BC Party
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.