అజర్ బైజాన్ విమాన ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ స్పందించారు. జే2-8243 విమానం కోల్పోయి 38 మంది మృతిచెందడం, మరో 29 మంది గాయపడటంతో ఆయన అజర్ బైజాన్ కు క్షమాపణలు చెప్పారు. అజర్ బైజాన్ దేశాధినేత తమను క్షమించాలని విజ్ఞప్తి చేశారు. అజర్ బైజాన్ లోని బాకు నగరం నుంచి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తుండగా కజఖిస్థాన్ లో ఆ విమానంలో కూలిపోయింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు రష్యా క్షిపణులను ప్రయోగించినట్టు ఆరోపణలు వచ్చాయి. అందులో ఒక క్షిపణి తగలడంతోనే విమానం కూలిపోయిందని అజర్ బైజాన్ తో పాటు ఉక్రెయిన్ ఆరోపించింది. ఈ ఆరోపణలపై పుతిన్ స్పందిస్తూ.. తమను అజర్ బైజాన్ అధినేత ఇల్హామ్ అలియేవ్ క్షమించాలని కోరారు. దీంతో విమాన ప్రమాదానికి తమ క్షిపణులే కారణమని పుతిన్ ఒప్పుకున్నట్టు అయ్యింది.
Previous Articleభవిష్యత్తులో నితీష్ టీమిండియాకు కెప్టెన్ అవుతారు : కేటీఆర్
Next Article 108 డ్రైవర్లకు గుడ్ న్యూస్..జీతాలు పెంపు
Keep Reading
Add A Comment